Mon Dec 23 2024 00:01:41 GMT+0000 (Coordinated Universal Time)
షాబాద్ ప్రీబిడ్ మీటింగ్ సక్సెస్
షాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్ఎండిఏ వెంచర్ అటు షాద్ నగర్ కు, శంషాబాద్ కు సుమారు 25 కిలోమీటర్ల..
దాదాపు వందమంది హాజరు
తొలిదశలో 50 ప్లాట్లను వేలం పెట్టిన హెచ్ఎండిఏ
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని షాబాద్ రెవెన్యూ గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) శనివారం నిర్వహించిన ప్రీబిడ్ సమావేశం విజయవంతం అయింది. షాబాద్ ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలో గల రెసిడెన్షియల్ జోన్ లో హెచ్ఎండిఏ 877 ప్లాట్లతో వెంచర్ ను ఏర్పాటు చేస్తుంది. శనివారం హెచ్ఎండిఏ షాబాద్ వెంచర్ స్థలంలో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్ కు వంద మంది హాజరయ్యారు.
షాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్ఎండిఏ వెంచర్ అటు షాద్ నగర్ కు, శంషాబాద్ కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల షాబాద్ లో హెచ్ఎండిఏ స్థిరాస్తి కొనుగోలుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. షాబాద్ లో వందఎకరాల హెచ్ఎండిఏ లే అవుట్ పరిధిలో 300 చొప్పున 877 ప్లాట్లతో వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నది. వాటిలో తొలిదశలో 50 ప్లాట్ లను హెచ్ఎండిఏ ఆన్ లైన్ వేలం ప్రక్రియ ద్వారా విక్రయిస్తున్నది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లాట్ల ధరలను గజం రూ.10,000 చొప్పున కనీస ధరగా హెచ్ఎండిఏ ఖరారు చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆన్ లైన్ వేలం ప్రక్రియలో పాల్గొని గజానికి రూ.500ల చొప్పున కోట్ చేసి ఏ1 బిడ్డర్ నిలిచి ప్లాట్లను సొంతం చేసుకోవచ్చు.
శనివారం జరిగిన ప్రీబిడ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి గా ప్రతినిధులు తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాంకేతిక అంశాలను వివరించారు. హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్(ఈవో) బి.కిషన్ రావు, హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ మాజీద్ షరీఫ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సిపివో) రవీందర్ రెడ్డి, చేవెళ్ల ఆర్డిఓ సాయిరాం, షాబాద్ తహసీల్దార్ సైదులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్, ఈఎంయు డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story