Mon Dec 16 2024 20:03:46 GMT+0000 (Coordinated Universal Time)
Look Back : 2024 టాలీవుడ్ లో ఈ ఏడాది హిట్టు.. ఫట్టు సినిమాలివే
2024 లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇటు సూపర్ హిట్ లను చూసింంది. అదే సమయంలో అట్టర్ ప్లాప్ లను కూడా తీసుకుంది
2024 లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇటు సూపర్ హిట్ లను చూసింంది. అదే సమయంలో అట్టర్ ప్లాప్ లను కూడా తీసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే గతంలో కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. పాన్ ఇండియా సినిమాలుగా అనేక హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కొన్ని కాసుల వర్షం కురిపిస్తుండగా, మరికొన్ని చిత్రాలు మాత్రం బోల్తాపడుతున్నాయి. ఇక అగ్రహీరోలు నటించిన సినిమాలతో పాటు ఈ ఏడాది చిన్న సినిమాలు కూడా ఊహించని రేంజ్ లో హిట్ అందుకున్నాయి. అంచనాలను అధిగమించి మరీ కలెక్షన్లు దండుకుంటుండగా, మరికొన్ని చిత్రాలు మాత్రం భారీఅంచనాలతో విడుదలయి ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు.
వసూళ్లను రాబట్టలేక...
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది విడుదలయింది. అయితే తొలిరోజుల్లో మంచి టాక్ వినిపించినప్పటికీ తర్వాత వసూళ్లను రాబట్టలేకపోయింది. తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిర్మాతలకు నష్టం తెచ్చిపెట్టలేదు కానీ, లాభాలు మాత్రం కురిపించలేకపోయింది. మరో అగ్ర హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ కూడా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. కింగ్ నాగార్జున నటించిన సా సామిరంగా చిత్రం మాత్రం కొంతవసూళ్లు రాబట్టినా అనుకున్న స్థాయిలో విజయంసాధించలేకపోయింది. ఇక ఈ ఏడాది విడుదలయిన అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రం కల్కి మాత్రం బాక్సాఫీస్ మాత్రం దుమ్మురేపింది. దాదాపు 1200 కోట్ల రూపాయల సొమ్మును రాబట్టిందని చెబుతారు. ప్రభాస్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్ కు మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
విడుదలకు ముందు రఫ్ ఆడించి...
ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా రిలీజ్ కు ముందే రఫ్ఫాడించింది. ఫస్ట్ నుంచి హిట్ టాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిర్మాతలు ఊహించని స్థాయిలో మాత్రం డబ్బులు రాబట్టలేకపోయింది. దేవర పార్ట్ 1 హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనుకున్న రోజులు ఆడలేదు. తక్కువ స్క్రీన్లలోనే యాభై రోజులు ఆడిందనిచెప్పాలి. ఈ సినిమాకు ఐదు వందల కోట్ల రూపాయల వసూళ్లు తెచ్చిపెట్టిందని చెబుతారు. ఇక ఈ ఏడాది చివరిలో విడుదలయిన పుష్ప ది రూల్ సినిమా కూడా అదే స్థాయిలో సినిమా విడుదలకు ముందు నుంచే అంచనాలు భారీగా వినిపించాయి. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకు ప్రమోషన్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పుష్ప 1 హిట్ కావడంతో రెండో పార్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద హిట్ అయి...
పుష్ప 1లో మాదిరిగా పాటలు హిట్ కాకపోయినా కలెక్షన్లలో మాత్రం పుష్ప 2 ఏమాత్రం తగ్గలేదు. పుప్ప 2 విడుదలయిన తొలి రోజే 294 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక వసూళ్లు మూడు రోజులు పాటు వరసగా బాక్సాఫీస్ వద్ద బాగా కనిపించినా తర్వాత నెమ్మదిగా మందగించాయని చెబుతున్నారు. అయితే ఈ సినిమా వెయ్యికోట్ల క్లబ్ లో చేరుతుందని నిర్మాతలు చెబుతున్నారు. దీంతో పాటు మరో హీరో రవితేజ నటించిన ఈగల్, మిస్టర్ బచన్ లు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మన్ననలను పొందలేదు. ఈ సినిమాలు కనీసం హిట్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే విడుదలయిన చిన్నసినిమాగా ఆరంభమై పెద్ద సినిమాగా హిట్ అయిన హనుమాన్ గురించి చెప్పుకోవాల్సిందే. తేజ సజ్జ నటించిన ఈచిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. దాదాపు 350 కోట్ల రూపాయలు రాబట్టింది. నాని నటించిన సరిపోదా శనివారం కూడా హిట్ టాక్ అందుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీభాస్కర్ సినిమా కూడా హిట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి మత్తు వదలరా 2 సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. మొత్తం మీద ఈ ఏడాది పదమూడు తెలుగు సినిమాలు, నాలుగు డబ్బింగ్ మూవీలుహిట్ అయ్యాయని టాలీవుడ్ వర్గాలుచెబుతున్నాయి. అదే సమయంలో అంతే స్థాయిలో సినిమాలు మాత్రం ప్లాప్ టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
Next Story