Sat Jan 11 2025 09:47:50 GMT+0000 (Coordinated Universal Time)
Anddhra Pradesh : సంక్రాంతికి ఊరెళుతున్నారా? అయితే ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన పోలీసులు
సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు
సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ. ఎక్కువ మంది తమ ఇళ్లకు స్థానాలు వేసి సొంత గ్రామాలకు బయలుదేరి వెళతారు. ఇళ్లలో బంగారం, విలువైన వస్తువులను అలాగే ఉంచి వెళతారు. ఇదే దొంగలు సరైన సమయంగా భావిస్తారు. గతంలోనూ అనేక దొంగతనాలు, దోపిడీలు జరిగాయి. లక్షలాది రూపాయల విలువైన బంగారం, నగదు వంటివి దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. సెలవుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు శ్రమించాల్సి వస్తుంది. అందుకే ఈసారి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు
బంగారం, నగదును...
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి వెళ్లేవారు తమ బంగారు ఆభరణాలను, నగదును తమ బ్యాంకు లాకర్లలో భద్రం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. లేకుంటే సమీపంలోని పోలీసులకు సమాచారం అందిస్తే తాము రక్షణ కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. దొంగలు ఈ సెలవుల్లో స్వైర విహారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు ప్రజలను అప్రమత్తమయ్యారు. ఇంటికి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం అందిస్తే తాము రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసు శాఖ భరోసా ఇస్తుంది. లాక్ డ్ హౌస్ మానటరింగ్ సిస్టమ్ ద్వారా ఇళ్లవద్ద పటిష్టత కల్పిస్తామని పోలీసులు చెబుతున్నారు.
జీరో క్రైమ్ ఉండాలని....
సంక్రాంతి పండగ సెలవు దినాల్లో జీరో క్రైమ్ ను ఉంచాలన్న నిర్ణయంతో పోలీసులు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి వేళ దోపిడీలు, దొంగతనాలు జరగకుండా పాత నేరగాళ్లపై నిఘా పెంచారు. వారి కదలికలను గమనిస్తూ వారిపై ఒక కన్నేసి ఉంచారు. ఊరికి వెళ్లే వారు ఏపీ పోలీసులకు చెందిన గూగుల్ ప్లేస్టోర్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తే వెంటనే వారి ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఇంటి తాళాలు పగులకొట్టేందుకు ఎవరు ప్రయత్నించినా పోలీసు కంట్రోల్ రూమ్ లో అలారం మోగేలా ఏర్పాటు చేశారు. దీనివల్ల క్రైమ్ రేటు తగ్గుతుందని చెబుతున్నారు.దీనివల్ల దొంగల బెడద నుంచి కాపాడుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. సో.. పండగ వేళ ఆనందంగా గడుపుకోవడానికి మీ వస్తువులను కాపాడుకోవడానికి పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు.
Next Story