Cock Fight : బరులు సిద్ధమవుతున్నాయ్.. జబ్బ చరిచి కోళ్లు దూకే సమయం వచ్చేసిందోచ్
సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఏపీలో సంక్రాంతి అంటే కోడి పందేలు లేకుండా జరగవు
సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఏపీలో సంక్రాంతి అంటే కోడి పందేలు లేకుండా జరగవు. అప్పుడే పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. బరులు కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ సొంత బరులను ఏర్పాటు చేసుకుని కోడిపందేలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో అనేక విశిష్టతలున్నప్పటికీ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. పందె కోళ్లు కాలు దువ్వుతుంటే మీసం మీద మెలేసిన చేయి దించకుండా ఎన్నికల్లో గెలిచినట్లే ఫీలవుతారు చాలా మంది. కోడి పందేలు లేకుండా పండగ లేదు. పండగ అంటేనే కోడి పందేలు అనే రకంగా మారింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now