Mon Dec 23 2024 05:09:05 GMT+0000 (Coordinated Universal Time)
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్
శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 నిమిషాలకు
శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌తో రాకెట్ నింగిలోకి వెళ్లింది. లిఫ్ట్ ఆఫ్ నార్మల్‌గా సాగింది. సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్1 మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఏడు పేలోడ్స్‌తో ఆదిత్యఎల్1 .. సూర్యుడిపై పరిశోధనల కోసం బయలుదేరింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ వద్దకు ఆదిత్య వెళ్తోంది. అక్కడ నుంచి సూర్యుడిని పరిశీలించనుంది.
ఆదిత్య ఎల్1 ఉపగ్రహం నాలుగు నెలల పాటు ప్రయాణించి సూర్యుడి దిశగా లగ్రాంజ్1 పాయింట్ కు చేరుకుంటుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యుడిని ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. సూర్యుడిపై సౌర తుపానులు, సౌర రేణువులు, దానిపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది ఆదిత్యలో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్, కరోనాను కూడా అధ్యయనం చేయనున్నాయి. ఆదిత్య L1 ఉపగ్రహం 1,475 కేజీల బరువు ఉంది. దీన్ని PSLV-C 57 రాకెట్లో నింగిలోకి పంపుతున్నారు. ఈ రాకెట్లో 1,231 కేజీల ద్రవ ఇంధనాన్ని నింపారు. ఈ ఇంధనాన్ని ఉపయోగించుకొని.. ఈ రాకెట్.. అంతరిక్షంలోకి శాటిలైట్‌ని పంపుతుంది. ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో దీన్ని వదులుతుంది.
Next Story