Mon Dec 23 2024 10:22:33 GMT+0000 (Coordinated Universal Time)
Alert Zombie Deer Disease: మానవాళికి పెను ముప్పుగా 'జోంబీ డీర్' డిసీజ్
ఇది మనుషులకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని అమెరికా లోని పరిశోధకులు హెచ్చరించినట్లు
కరోనా మహమ్మారి ప్రజలను ఎంతగా బాధిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా ఆ మహమ్మారి ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి ఇలా ప్రపంచానికి చుక్కలు చూపెడితే.. ఇంకా ఎన్నో అత్యంత ప్రమాదకరమైన వైరస్ లు మన చుట్టూనే ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు మరచిపోకూడదు. ఇప్పుడు మరో వైరస్ ముప్పు ఎంచుకుని మానవాళి ఉంది. అదే 'జోంబీ డీర్'(Zombie Deer Disease Humans)వైరస్. ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్.. ప్రజలకు సోకడం మొదలైతే మాత్రం మనల్ని మనం రక్షించుకోవడం మాత్రం చాలా కష్టం.
ఉత్తర అమెరికాలోని వన్యప్రాణులకు వ్యాపిస్తూ ఉంది క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (Chronic Wasting Disease). ఇది మనుషులకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని అమెరికా లోని పరిశోధకులు హెచ్చరించినట్లు ఇండిపెండెంట్ సంస్థ నివేదించింది. ఈ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ ను 'జోంబీ డీర్ డిసీజ్' అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ కారణంగా జంతువులు వింత వింతగా ప్రవర్తిస్తాయి. ఆయా జంతువుల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. నవంబర్లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో మొదటిసారిగా కనుగొనబడింది. వ్యోమింగ్లోని జింక, ఎల్క్, దుప్పి లాంటి 800 జంతువుల నమూనాలలో ఈ వ్యాధి కనుగొన్నారు. నిపుణులు CWDని ''నెమ్మదిగా కదిలే విపత్తు''గా ప్రకటించారు. అది కాస్తా మానవులకు వ్యాపించే అవకాశం ఉందని.. ఒకవేళ అదే కానీ జరిగితే అందుకోసం సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలకు నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఈ వ్యాధి అమెరికాలోని 31 రాష్ట్రాల్లో నివేదించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా నీరసం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి. బ్రిటన్లో గతంలో 'మ్యాడ్ కౌ' వ్యాధి ఎంత టెన్షన్ పెట్టిందో ప్రజలు మరచిపోకూడదని నిపుణులు హెచ్చరించారు. పశువుల నుండి మనుషులకు స్పిల్ఓవర్ సంఘటన జరిగినప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని ఒక ఉదాహరణగా వివరించారు. అలాంటిదే మరోసారి సంభవిస్తే.. దాన్ని ఎదుర్కోడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని CWD పరిశోధకుడు డాక్టర్ కోరీ ఆండర్సన్ ది గార్డియన్తో అన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్, రేడియేషన్ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని కూడా తెలిపారు.
దానిని నిర్మూలించడానికి ఎలాంటి మార్గం లేకపోవటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చునని అంటున్నారు. అయితే ఫాక్స్ న్యూస్ ప్రకారం, మానవులలో CWDకి సంబంధించిన ఏ కేసు కూడా ఇంకా నమోదు కాకపోవడం మనం కొంచెం ధైర్యంగా ఉండేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు మాత్రం దీర్ఘకాలిక వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినే కోతులకు ప్రమాదం ఉందని సూచించాయి. ''ఈ అధ్యయనాలు ప్రజలకు కూడా ప్రమాదం ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 1997 నుండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని తెలిసిన ప్రియాన్ వ్యాధుల ఏజెంట్లను మానవ ఆహార గొలుసులోకి ప్రవేశించకుండా ఉంచడం చాలా ముఖ్యం అని సిఫార్సు చేసింది,'' అని CDC వెబ్సైట్ చదువుతుంది. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని నిపుణులు వివరించారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని తెలిపారు.
జోంబీ డీర్ డిసీజ్ అంటే ఏమిటి?
క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (CWD) అని కూడా పిలువబడే 'జోంబీ డీర్ డిసీజ్' అనేది ఒక అంటువ్యాధి. ప్రాణాంతక అనారోగ్యం కలిగిస్తుంది. ఇది జింక, ఎల్క్, కారిబౌ, రెయిన్ డీర్, దుప్పి వంటి జంతువుల సమూహంలో కనిపించే వ్యాధి. ఇది మెదడు, ఇతర కణజాలాలలో పేరుకుపోయి శారీరక, ప్రవర్తనా మార్పులు, క్షీణత, చివరికి మరణానికి కారణమవుతుంది. ప్రోటీన్ (ప్రియాన్) వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతాయి. ఇది ఒక జంతువు నుండి మరో జంతువుకు సంపర్కం ద్వారా లేదా పరోక్షంగా మలం, నేల, వృక్షసంపద వంటి పర్యావరణంలో వ్యాపిస్తుంది. జంతువులు వాటి మేత లేదా పచ్చిక బయళ్లను మోసుకెళ్లే ప్రియాన్లతో కలుషితమైతే అవి కూడా సోకవచ్చు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కాలం పట్టవచ్చు. జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిని కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం, CWD వద్ద ఎటువంటి నివారణ లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ మాత్రం నిపుణులు ఇవ్వలేకపోతున్నారు.
Next Story