Revanth Reddy : రేవంత్ రాకతోనే... కాంగ్రెస్ కు విజయం కాదంటారా ఎవరైనా?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నప్పటికీ రేవంత్ రెడ్డి పాత్రను ఎవరం కాదనలేం
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నప్పటికీ రేవంత్ రెడ్డి పాత్రను ఎవరం కాదనలేం. నిజానికి నాలుగు నెలల క్రితం వరకూ కాంగ్రెస్ అసలు రేసులోనే లేదు. కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే బీఆర్ఎస్ కు వెళ్లిపోతారన్న అనుమానం ప్రజల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ విజయం కోసం పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే... గతంలో నేతల మధ్య ఐక్యత లేకపోవడం ఒక కారణమైతే... రేవంత్ నాయకత్వం కూడా ఒక కారణని చెప్పక తప్పదు. రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కొంత పుంజుకుందనే చెప్పాలి. ఆయనను పీసీసీ చీఫ్ గా అడ్డుకోవాలని చాలా మంది సీనియర్లు చేసిన ప్రయత్నాలు పార్టీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. లైట్ గానే తీసుకుంది. కాంగ్రెస్ లోకి వచ్చి త్వరగానే మేక్ ఓవర్ అయ్యారు. తొలి నుంచి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ అయితేనే పార్టీని అధికారంలోకి తేగలరన్న నమ్మకం హైకమాండ్ కు కూడా కలిగింది.