Mon Dec 23 2024 11:44:42 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డుపై కదిలే గార్డెన్.. ఆటో అంజి గొప్పదనం
కొందరు చెట్లను, మొక్కలను తమ తమ గార్డెన్ లలో పెంచుతూ ఉంటారు
కొందరు చెట్లను, మొక్కలను తమ తమ గార్డెన్ లలో పెంచుతూ ఉంటారు. మరి కొందరు ఇంట్లో ఎక్కడైనా స్థలం ఉంటే పెంచేస్తూ ఉంటారు. అయితే అంజి అనే ఆటో డ్రైవర్ ఏకంగా తన ఆటో రిక్షా మీద పెంచి చూపించాడు. మహబూబాబాద్‌కు చెందిన అంజి తన ఆటో మీద పూల మొక్కలను పెంచి BRS రాజ్యసభ ఎంపీ J సంతోష్ కుమార్ దృష్టిని ఆకర్షించాడు. అంజికి పచ్చదనం అంటే ఎంతో ఇష్టం.. చివరికి సీట్లు మొత్తం కూడా గ్రీన్ రంగులోనే ఉంటాయి. ఆటోలో వెళ్లే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఫ్యాన్స్ కూడా పెట్టాడు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ అంజిని అభినందనల్లో ముంచెత్తారు. తన ఆటో రిక్షా పైన మినీ గార్డెన్‌ను ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ అంజి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సీటు కవర్ల స్థానంలో కృత్రిమ గడ్డితో ఆటో డ్రైవర్ కూడా తన వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించాడు. మహబూబాబాద్‌కు చెందిన అంజి అనే ఆటో డ్రైవర్‌కు హ్యాట్సాఫ్ అని తెలిపారు. ఈ ఎండవేడిలో ప్రయాణాన్ని చల్లగా మార్చాడు! తన ఆటో పైన మొక్కలను పెంచుతూ, అతను వేసవి కాలంలో వేడిని ఎలా తగ్గించాలో తెలియజేస్తున్నాడు. ఈ ఎకో-యోధుడిని కలుసుకోవడానికి వేచి చూస్తున్నానని తెలిపారు.
Next Story