Sat Nov 23 2024 00:17:16 GMT+0000 (Coordinated Universal Time)
బండికళ్ల ప్రదీప్ నారాయణ్.. అద్భుతమైన ట్యాలెంట్
బండికళ్ల ప్రదీప్ నారాయణ్ వయసు చిన్నదే.. సాధిస్తోంది చాలానే
బండికళ్ల ప్రదీప్ నారాయణ్ వయసు చిన్నదే.. సాధిస్తోంది చాలానే..! ఎందుకంటే అతడి మెమొరీ పవర్ అద్భుతం. కేవలం 1 సంవత్సరం, 11 నెలల వయస్సులో ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన ప్రదీప్ నారాయణ్ లో అసాధారణమైన ప్రతిభ ఉందని ప్రపంచం గుర్తించింది. తెలివితేటలు, జ్ఞాపకశక్తి విషయంలో పిల్లాడు సూపర్ అని అంటున్నారు. అందుకే రికార్డులు కూడా ఆ పిల్లాడి సొంతం అవుతూ ఉన్నాయి. అతను జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, మానవ శరీర భాగాలు, గృహోపకరణాలతో సహా 150 పేర్లను గుర్తించగలిగే సామర్థ్యాన్ని 11 నిమిషాల్లోనే ప్రదర్శించాడు. ప్రదీప్ అసాధారణమైన ఫీట్ అతనికి ప్రతిష్టాత్మక ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కేలా చేసింది. ప్రపంచంలోనే చెరగని ముద్ర వేసి రికార్డు సృష్టించిన యువ మేధావి బండికళ్ల ప్రదీప్ నారాయణ్‌ను పలువురు అభినందిస్తూ ఉన్నారు.
ప్రదీప్ నారాయణ్ 150 పైగా జంతువులు, పక్షులు, కూరగాయలు, ఇంట్లోని ఇతర వస్తువుల పేర్లు 11 నిమిషాల్లోనే చెప్పేస్తున్నాడు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ.. రెండు కేటగిరీల్లో బాలుడికి ‘బెస్ట్ ఎచీవర్స్ కిడ్', 'సూపర్ గ్రాస్పింగ్ అండ్ మెమరీ పవర్' అవార్డులనిచ్చి రికార్డ్స్ పుస్తకంలో నమోదు చేసింది. ప్రదీప్ నారాయణ్ తల్లిదండ్రులు గుణప్రియ, రాజేష్. రాజేష్ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గుడివాడ. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. బాబుకు ఏడాదిన్నర వయసులో కొన్ని పదాలు చెప్పగానే రెండు మూడు రోజుల తర్వాత కూడా చెప్పగలుగుతున్నాడు. మరికొన్ని పదాలు నేర్పడంతో వాటిని వల్లెవేయడం మొదలెట్టాడు. ఆయా వస్తువులను చూపించగానే పేర్లు చెప్పసాగాడు. వాటిన్నింటినీ తల్లిదండ్రులు వీడియో రికార్డ్ చేసి వాటిని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపారు ఆ సంస్థ బాలుడిని 'సూపర్ టాలెంటెడ్ కిడ్ రికార్డ్' పుస్తకం లో నమోదుచేసింది. ఇలా పిల్లాడి ట్యాలెంట్ ను చూసి పలు సంస్థలు అతడికి అవార్డులను బహూకరిస్తూ ఉన్నాయి.
Next Story