Sun Dec 22 2024 21:30:16 GMT+0000 (Coordinated Universal Time)
KCR : రియలైజేషన్ మొదలయిందా బాసూ.. దెబ్బ తగిలితేకాని తెలీకపాయె
తెలంగాణ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు పంచిపెట్టినా తనను ఎందుకు ఓడించారన్నది ఆయనకు ఇప్పటికీ అర్థం కాలేదు. సుదీర్ఘ రాజకీయ నాయకుడు ఆయన. అన్నింటిలో ఆరితేరారు. అంచనాలు వేయడంలో దిట్ట. బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ వల్ల కాదన్నది కేసీఆర్ కు తెలియంది కాదు. తన తప్పిదాలవల్లనే ప్రజలు పక్కన పెట్టారన్న విషయం క్రమంగా అర్థమవుతుంది. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నేలమీదకు చూడకపోవడమే అసలు తప్పు. ఎమ్మెల్యేలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పథకాల అర్హులను నిర్ణయించమని చెప్పడం మరొక తప్పుగా ఆయన భావిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చి....
ఎమ్మెల్యేలు కేవలం తన అనుచరులకు ఇచ్చిన ప్రయారిటీ సంక్షేమ పథకాల విషయంలో ప్రజల వైపు చూడలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు చేసిన తప్పులు తనకు ఓటమిని తెచ్చి పెట్టాయని ఆయన తెలుసుకున్నారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దారుణంగా డ్యామేజీ అయింది. ఎమ్మెల్యేలను కాదని ప్రభుత్వ అధికారులకు లబ్దిదారుల ఎంపిక బాధ్యత పెట్టి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారని తెలిసింది. పేద వర్గాలను పక్కన పెట్టి ఎమ్మెల్యే అనుచరులు పథకాల మంజూరులో దందాను నిర్వహించడం కూడా కొంపమునగడానికి కారణమయిందన్న అభిప్రాయం ఆయనలో బలంగా నాటుకుంది.
వాళ్లే హైలెట్...
దీంతో పాటు కుటుంబ సభ్యులు హైలెట్ కావడం కూడా నష్టం తెచ్చి పెట్టిందన్న నిర్ణయానికి వచ్చారు. తమ కుటుంబ సభ్యులు తనకు చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటే... వారే జనం మనసులో విలన్లుగా మారారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం పార్టీని బాగా దెబ్బతీసిందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు కేటీఆర్, హరీశ్ రావులు మాత్రమే కనపడుతుండటం, మిగిలిన సామాజికవర్గాలు ప్రజలకు కనిపించకపోవడంతో ఫ్యామిలీ దెబ్బ బాగా కొట్టేసిందన్న నిశ్చయానికి వచ్చారు. కుటుంబ సభ్యులను దూరం చేసుకునే అవకాశం లేదు. అలాగని వారికి ఇచ్చిన ఓవర్ ప్రయారిటీయే ఎక్కువ దెబ్బతీసిందన్న అభిప్రాయానికి వచ్చారు.
ఫ్యామిలీ నీడను...
అందుకే శాసనసభ పక్ష నేత ఎంపిక విషయంలో ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. తాను అసెంబ్లీకి వెళ్లి ముఖం చూపించలేని పరిస్థితుల్లో వేరే సామాజికవర్గానికి శాసనసభ పక్ష పదవిని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాకముందు ఈటల పార్టీ నేతగా ఉండేవారు. ఇప్పుడు అదే తరహాలో కుటుంబ సభ్యులకు కాకుండా ముఖ్యమైన పదవులన్నీ వేరే సామాజికవర్గాలకు కేటాయించాలన్న అభిప్రాయంలో ఉన్నారు. తన మీద పడ్డ ఫ్యామిలీ నీడను వదిలించుకోవాలన్న భావన ఆయనలో కనపడుతుంది. త్వరలోనే తెలంగాణ భవన్ లో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి నేతను ఎన్నుకుందామని ఆయన చెప్పిన తీరు కూడా ఇందుకు అద్దం పడుతుంది. చూడాలి మరి ఏం జరుుతుందో.
Next Story