Mon Dec 23 2024 18:13:19 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రుడి వైపు మొదలైన చంద్రయాన్-3 ప్రయాణం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా మరో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చంద్రయాన్ వ్యోమనౌక తాజాగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది. భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తిచేసి చంద్రుని వైపు వెళ్తున్నదని తెలిపింది. ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ (ISTRAC) వద్ద పెరిజీ-ఫైరింగ్ విజయవంతంగా పూర్తయిందని, వ్యోమనౌకను ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో తెలిపింది. మరో ఐదు రోజుల్లో ఆగస్టు 5 నాటికి చంద్రుడి కక్ష్యకు చేరుకుంటుందని వెల్లడించింది. ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ (TLI) ప్రక్రియ తర్వాత వ్యోమనౌక భూ పరిభ్రమణాలు పూర్తిచేసుకుని చంద్రుని మార్గాన్ని అనుసరిస్తున్నదని ఇస్రో అధికారి తెలిపారు.
చంద్రయాన్-3ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2023 జూలై 14న ప్రయోగించారు. అప్పటి నుండి ఇది విజయవంతంగా ఐదు ఆర్బిట్-రైజింగ్ మేన్యువర్ అమలు చేసింది, దాని అంతిమ గమ్యస్థానమైన చంద్రుడికి దగ్గరగా వెళుతోంది. చంద్రయాన్ భూమి చుట్టూ ఆగస్టు 1న ఐదవ కక్ష్య ని విజయవంతంగా పూర్తి చేసి.. భూమిని వీడింది. దీంతో చంద్రయాన్-3 చంద్రుడి పైకి 3.8 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇస్రో ప్రణాళిక ప్రకారం ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న చంద్రయాన్ -3, ఆగస్టు 23న జాబిల్లిపై దిగనుంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.
Next Story