'యుద్ధనీతి'లో టాప్ కేసీఆర్ ! కాంగ్రెస్ చిన్నాభిన్నం !!
తనకు విధేయులైన వాళ్లకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో, తనకు గిట్టని వాళ్ళను ఎలా అణచివేయాలో బిఆర్ఎస్ నిర్మాతకు తెలిసినంతగా..
'ప్రత్యర్థులను బలహీనపరచడం మన విజయానికి కీలక మెట్టు అవుతుంద'ని రాజనీతి శాస్త్రం చెబుతోంది. ఈ శాస్త్రాన్ని కాచివడబోసిన కేసీఆర్ 2014 నుంచి ఇలాంటి వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నారు. దాంతో తన దరిదాపుల్లో ఎవరూ లేకుండా చేసుకోగలిగారు. అలాగే తనకు సమఉజ్జీగా మరొకరు తయారవకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మరికొందరు కాంగ్రెస్ ముఖ్యులకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల విసిరారు. ఇప్పటివరకు కేసీఆర్ గాలానికి చిక్కని రాజకీయ నాయకులంటూ లేరు. అంత అద్భుతమైన ఎత్తుగడలతో ఆ 'గాలం' ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి శిష్యుడు, భువనగిరి డీసీసీ అధ్యక్షుడు, అర్ధబలం పుష్కలంగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముందుగా కేసీఆర్ గాలానికి చిక్కారు. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారు.
అలాంటి చాణక్య ప్రదర్శనలో కేసీఆర్ దిట్ట
విభజనకు ముందే అధ్యయనం
(Views, thoughts, and opinions expressed in this newsstory/article belong solely to the author)