Sat Nov 23 2024 07:54:28 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తు అన్నా రారేందబ్బా?
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. చేరికలకు ఇదే సమయం. పార్టీలో నేతలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జంప్ చేయడానికి టైం ఇదే.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. చేరికలకు ఇదే సమయం. పార్టీలో నేతలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జంప్ చేయడానికి కరెక్ట్ టైం ఇదే. అందులోనూ అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని నమ్మేవాళ్లు.. అధికారంలోకి వస్తుందని అంచనా వేసుకున్న పార్టీల్లోకి వచ్చేస్టుంటారు. ఎక్కడైనా జరిగేది అంతే. తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ లో గాంధీభవన్ వద్ద నేతలు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం కావచ్చు. లేదంటే తాము ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలన్న కోరిక కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్లలో చేరికలతో ధూంధాంగా రాజకీయ సీన్లు ఉన్నాయి.
చేరికలు లేక…
అదే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చేరికలు లేవు. ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్.. జనసేనతో పొత్తు ఈ రెండు అంశాలతో ఆ కూటమికి హైప్ క్రియేట్ అయింది. అయితే అది మీడియాలోనా, జనంలోనా? అన్నది పక్కన పెడితే వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీ కూటమి కాబట్టి చేరికలు ఎక్కువ సంఖ్యలో ఉండాలి. అయితే చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని చేరికలు ఉండే అవకాశముందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతలు వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అయితే అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎక్కువ మంది నేతలు టీడీపీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
బాబు జైలులో ఉండటంతో..
ఇక పొత్తు ప్రకటన చేసిన తర్వాత జాయినింగ్స్ ఎలా ఉండాలి? మామూలుగా ఉండకూడదు. టిక్కెట్ రాదని భావించిన టీడీపీ నేతలు కూడా గాజుగ్లాసు వైపు చూడాలి. టీడీపీ అంటే నేతలతో ఫుల్లు అయిపోయింది. కానీ జనసేన అలా కాదుగా? దాదాపు వందకు నియోజకవర్గాల్లో సరైన నేతలు లేరు. నాయకత్వం కూడా లేదు. దీంతో అక్కడ అయితే తమకు సేఫ్ అని భావించి జంప్ చేయాలి. కానీ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన తర్వాత కూడా జనసేన వైపు నేతలు చూడటం లేదంటే ఏమని భావించాలి? అది ఎవరి ఊహకు వారిని వదిలేయాల్సిందే. అంటే ఇప్పటికీ జనసేన పై నమ్మకం లేదనే అనుకోవాల్సి ఉంటుందన్నది కాదనలేని వాస్తవం.
అదే కారణం….
చేరికలు లేకపోవడానికి కారణాలేంటి? పవన్ కల్యాణ్ నిజంగానే చేరికలను ప్రోత్సహించడం లేదా? లేక నేతలే ఆ పార్టీలో చేరడం అనవసరమనుకుంటున్నారా? అన్నది మాత్రం ఇప్పుడు పొలిటికల్ కారిడార్ లో చర్చగా మారింది. ప్రధానంగా ఇప్పుడు జనసేనలో చేరినా టీడీపీ అధినేత చంద్రబాబును కాదని సీటు కోసం పట్టుబట్టేందుకు పవన్ ప్రయత్నించరన్నది ఒక కారణమని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని సీట్లు పొత్తులో భాగంగా తీసుకోవాలని డిసైడ్ అయినందున కొత్తగా అక్కడకు వెళ్లినా సాధించేదేమీ ఉండదని భావించి నేతలు జనసేన పార్టీలో చేరేందుకు సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం నేతలు కూడా చేరకపోవడానికి ఇదే కారణమని భావించాల్సి ఉంటుంది.
Next Story