Fri Nov 22 2024 23:13:45 GMT+0000 (Coordinated Universal Time)
ట్రేడ్ మార్క్ అంటే ఏమిటి.. వ్యాపారాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది?
ట్రేడ్మార్క్ అనేది ఒక సంస్థ నుండి వచ్చే వస్తువులు లేదా సేవలను
ట్రేడ్మార్క్ అనేది ఒక సంస్థ నుండి వచ్చే వస్తువులు లేదా సేవలను ఇతర సంస్థల నుండి వేరు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ట్రేడ్మార్క్లను మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించుకోవచ్చు. ట్రేడ్మార్క్ అనేది ఇతర బ్రాండ్ ల నుండి తమది వేరే బ్రాండ్ అని వేరు చేయడానికి ఉపయోగించే చిహ్నం. దీనికి లోగోలను కూడా సృష్టిస్తూ ఉంటారు. ఆధునిక కాలంలో, వినియోగదారునికి సాధారణంగా వస్తువుల తయారీదారుని వ్యక్తిగతంగా తెలియదు, పారిశ్రామిక విప్లవం ప్రారంభానికి ముందు, పరిమిత సంఖ్యలో తయారీదారులు ఉన్నప్పుడు ప్రతి వినియోగదారు తయారీదారున్ని వ్యక్తిగతంగా తెలుసుకునేవారు. ఇప్పుడు అలా మనసులో ఉండిపోడానికి ఈ ట్రేడ్ మార్క్ అనే దాన్ని తీసుకుని వచ్చారు. చూడగానే ఇది ఆ బ్రాండ్ కు సంబంధించింది అంటూ గుర్తు పట్టాలంటే మాత్రం ట్రేడ్ మార్క్ మీద ఓ ఐడియా అన్నది ఉండాల్సిందే!!
ట్రేడ్మార్క్లకు చట్టపరమైన రక్షణను అందిస్తూ ఉంటారు. అవి కూడా మేధో సంపత్తిలో భాగమే. ప్రధానంగా గుడ్విల్ ఆధారంగా ఉత్పత్తులు, సేవల నాణ్యతా ప్రమాణాన్ని ప్రదర్శిస్తాయి. ఆయా బ్రాండ్ లు మోసపోకుండా.. నకిలీ వస్తువుల సమస్య లేకుండా చట్టపరమైన రక్షణను అందిస్తాయి. ట్రేడ్మార్క్ వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవల మూలాన్ని సూచిస్తుంది. వినియోగదారులకు ట్రేడ్మార్క్ ఉండే వస్తువుల నాణ్యతకు హామీ ఇస్తుంది. ఉత్పత్తి గుడ్విల్కు సంబంధించిన నాణ్యతతో పాటు, ట్రేడ్మార్క్ బ్రాండ్ అవగాహనను కూడా సృష్టిస్తుంది. కంపెనీలు ఏదైనా ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి, కస్టమర్లకు మార్కెటింగ్ చేయడానికి, కస్టమర్ మద్దతును పొందడానికి ట్రేడ్మార్క్ ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎన్నో మరెన్నో విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
Next Story