Tue Nov 05 2024 10:49:30 GMT+0000 (Coordinated Universal Time)
Global Fact 11 conference: ఫ్యాక్ట్ చెకర్స్ పై పెరుగుతున్న దాడులను అడ్డుకోవాలి
సారాజెవో, బోస్నియా అండ్ హెర్జెగోవినా: తప్పుడు వార్తల ప్రచారంపై పోరాడుతున్న సంస్థల్లో
సారాజెవో, బోస్నియా అండ్ హెర్జెగోవినా: తప్పుడు వార్తల ప్రచారంపై పోరాడుతున్న సంస్థల్లో తెలుగుపోస్ట్ ముందు వరుసలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్వర్క్ (IFCN) కోడ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ను పాటిస్తూ నిజ నిర్ధారణ చేస్తూ ఎన్నో వైరల్ వాదనలపై తెలుగుపోస్ట్ పోరాటం చేసింది. జర్నలిజంలో ఖచ్చితత్వం పాటిస్తూ.. పక్షపాతరహితంగా వ్యవహరిస్తూ పారదర్శకత కోసం ఉన్నత ప్రమాణాలతో ముందుకు వెళుతోంది.
గ్లోబల్ ఫ్యాక్ట్ 11 కాన్ఫరెన్స్‌లో తెలుగుపోస్ట్కు బి.ఎన్. సత్య ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సారాజెవోలో బుధవారం నాడు మూడు రోజుల ఈవెంట్ ప్రారంభమైంది. “Findings from the India elections” అనే అంశంపై సత్య ప్రియ ఒక సెషన్ ను నిర్వహించారు. ఈ వార్షిక సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్ట్ చెకర్స్, పాత్రికేయులు, పరిశోధకులు భాగమయ్యారు. మొదటి రోజున.. వక్తలు భావప్రకటనా స్వేచ్ఛ నుండి వాస్తవాలను తనిఖీ చేసేవారిపై పెరుగుతున్న దాడుల గురించి, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వల్ల ఎదురవుతున్న కొత్త సవాళ్లను చర్చించారు.
సారజెవో స్టేట్మెంట్ పై 80 దేశాలకు చెందిన 130 ఫ్యాక్ట్ చెకర్స్ మద్దతు తెలిపారని IFCN డైరెక్టర్ అంగీ డ్రోబ్నిక్ హోలన్ తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఫ్యాక్ట్ చెకర్స్ పై పెరుగుతున్న దాడులు, డాక్సింగ్, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు, శారీరక హింస గురించి ఈ ప్రకటనలో హైలైట్ చేశారు. సెన్సార్ షిప్ అన్నది సమాచారాన్ని తీసివేస్తుంది.. అలాంటప్పుడు ఫ్యాక్ట్ చెకింగ్ కారణంగా అందాల్సిన సమాచారం దక్కుతుందని తెలిపారు.
వాస్తవ తనిఖీ తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సందేశాలను తొలగించడానికి ప్రయత్నించదని.. నిజం తెలియజేయడానికి అవసరమైన సాక్ష్యాలను అందజేస్తూనే పబ్లిక్ డిబేట్లో భాగంగా వాటిని భద్రపరిచే ప్రయత్నం చేస్తుంది. క్లెయిమ్‌ల వాస్తవికతను గుర్తించడానికి ప్రజలకు తగిన సందర్భం, ధృవీకరణను అందించాల్సి ఉంటుంది. హాని కలిగించే కొంత సమాచారం తీసివేయవచ్చు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాల పెరుగుదల, ఈ సాధనాలు చాలా వేగంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో పాత్ర పోషిస్తాయని తేలింది. ఖచ్చితత్వం అవసరం గతంలో కంటే ఇప్పుడు ఇంకా ముఖ్యమైంది.
సరజెవో ప్రకటన పూర్తి పాఠం క్రింది విధంగా ఉంది:
2024లో సారాజెవో జరిగే ప్రపంచ ఫ్యాక్ట్ చెకర్స్ వార్షిక సమావేశంలో ప్రపంచంలోని ప్రజలందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి మా దీర్ఘకాల నిబద్ధతను పునరుద్ఘాటించాల్సిన సమయం ఇది.
సమాచారం, స్వీకరించడానికి- అందించడానికి ప్రజలందరికీ హక్కు ఉంది. వాస్తవ తనిఖీ ఈ సూత్రాలలో లోతుగా పాతుకుపోయింది. వాస్తవ తనిఖీకి మూలాధారాలను కనుగొనడం, విస్తృతంగా చదవడం, నిజాయితీగా మాట్లాడే స్వేచ్ఛ ఉన్న నిపుణులను ఇంటర్వ్యూ చేయడం వంటి హక్కు, సామర్థ్యం అవసరం. ఇవన్నీ నిజమైన వాస్తవ-తనిఖీని నిర్మించడానికి పునాది. వాస్తవ తనిఖీ అనేది ఫ్రీ ప్రెస్ లో భాగం. ప్రజలకు సరైన సమాచారం అందాల్సి కూడా ఉంది. విజ్ఞానాన్ని అందించడం ఫ్యాక్ట్ చెకర్స్ బాధ్యత. తప్పుదారి పట్టించే వాదనలు, ప్రస్తుత సందర్భంతో ఏ మాత్రం లింక్ లేని వాటికి సంబంధించి అదనపు సమాచారాన్ని అందించడానికి, సాక్ష్యాలు ముఖ్యం. వాస్తవ తనిఖీ అనేది ఈ సందేశాలను తొలగించడానికి ప్రయత్నించదు, అయితే ఇవన్నీ తప్పుడు కథనాలని చెబుతూ.. ఆ సాక్ష్యాలను అందిస్తూనే వాటిని పబ్లిక్ డిబేట్లో భద్రపరచవచ్చు.
ఇటీవలి కాలంలో ఫ్యాక్ట్ చెకర్స్ పై కనికరం లేకుండా దాడి చేస్తున్నారు. బెదిరింపులు, రాజకీయ ఒత్తిడి, శారీరక హింసకు కూడా గురయ్యారు. మీడియా, ఆన్లైన్ కంపెనీలు ప్రసంగాన్ని ఎలా హోస్ట్ చేస్తాయి అనే దాని గురించి అవసరమైన చర్చలు చాలానే జరిగాయి.. జరుగుతున్నాయి కూడా. టెక్ ప్లాట్‌ఫారమ్‌లు పబ్లిక్ పోస్ట్‌లను ఎలా క్యూరేట్ చేస్తారు.. మోడరేట్ చేస్తారనే విషయం కూడా చాలా ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు అసలు హాని కలిగించినట్లయితే కొంత సమాచారం తీసివేయవచ్చు. క్లెయిమ్‌ల వాస్తవికతను గుర్తించడానికి ప్రజలకు తగిన సందర్భం, ధృవీకరణ అందించాలి. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాల రాకతో, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి సామర్థ్యంపై అవగాహన పెరుగుతోంది. వాస్తవ తనిఖీ అనేది ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో సహాయపడడమే కాకుండా.. సమాచార పర్యావరణ వ్యవస్థలను మెరుగుపరచడంలో కీలకమైన భాగం.
Next Story