Tue Nov 05 2024 16:38:33 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎదుర్కొనేలా పిల్లలను సిద్ధం చేయడం ఎలా?
ఇక్కడ పేర్కొన్న సంపూర్ణ నైపుణ్యాలు సురక్షితమైన భవిష్యత్తు కోసం అత్యవసరం, ప్రత్యేకించి మానవ శ్రమ, సహకారం వంటి వాటిని
"ప్రస్తుతం మనం ఏఐ గురించి ఎంతగానో చర్చించుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మనిషి మేధోసంపత్తిని తక్కువ చేసి చూడకూడదు. మనుషుల సృజనాత్మకత, మానవ భావోద్వేగాలు ఒక గొప్ప శక్తిగా కొనసాగుతున్నాయి. యంత్రాల కంటే ఇవి గొప్పవి" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. RAISE 2020, ది గ్లోబల్ వర్చువల్ సమిట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ.
21వ శతాబ్దపు ప్రపంచంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మనిషికి ఎంతో తోడ్పడుతూ ఉంది. ఎన్నో విషయాలలో మనిషి సాయం అందిస్తూ ఉంది. వ్యవసాయం నుండి రవాణా వరకు, అమ్మకాలు, మార్కెటింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగం వరకు AI సాధనాలు ఎంతో ప్రయోజనకరంగా మారాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్ అనాలిసిస్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం.. 2023 నాటికి, AI 51.8 శాతం వరకు మార్కెట్ ఉత్పత్తులు, సేవలలో భాగమైంది. జీవితంలోని అన్ని విభాగాల్లో AI భాగమైంది. ఈ మార్పులకు మనం కూడా అలవాటు పడాలంటే సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత కూడా చాలా అవసరం. విద్యార్థులను వినూత్నంగా, చురుకైన వారీగా, వినూత్న పరిస్థితులకు ఎలా రియాక్ట్ అవుతుంటారు, వాటిని ఎదుర్కొనేలా విద్యా వ్యవస్థ సిద్ధం చేయాలి.
ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ (ECE) సంస్కరణల ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, విద్యను ఒక చోట చేరుస్తుంది. ఇది ఆలోచన, నైపుణ్యాలు, సమగ్ర అభివృద్ధికి విద్యా వ్యవస్థ తీరును మార్చే అవకాశం ఉంటుంది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారి అభ్యాస ఫలితాలుగా దృష్టి సారించే బోధనా పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. సమగ్రమైన 5Cs (క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబోరేషన్, క్యారెక్టర్) స్కిల్స్ సిస్టమ్ విద్యార్థులు క్రిటికల్ థింకర్లుగా ఎలా మారవచ్చు, పరిష్కారాలను కనుగొనగలరా.. వారి లక్ష్యాలను సాధించడం కోసం ఒకరికొకరు సహకరించుకోవడం.. లక్ష్యాలను చేరుకోవడం కోసం సరైన దారిని ఎంచుకోవడం లాంటి సహాయ సహకారాలను అందిస్తుంది.
కమ్యూనికేషన్, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, ఉత్సుకత, సహకారం, ఇతర సామర్థ్యాలను పెంపొందించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ముఖ్యం. రాబోయే తరంలో AI ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది.. అలాంటి సమయంలో దీర్ఘకాలిక కెరీర్లను కొనసాగించడంలో ఎలా సహాయపడగలదో ఈ కథనం విశ్లేషిస్తుంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే ఛాలెంజ్ లను స్వీకరించేందుకు విద్యార్థులను సిద్ధం చేయడం:
భారతదేశం విద్యార్థులను డిజిటల్ నైపుణ్యాలతో తీర్చి దిద్దడడమే కాకుండా.. డిజిటల్, యాంత్రిక ప్రపంచ డిమాండ్లకు తగ్గట్టుగా సమర్ధవంతంగా విద్యార్థులను సిద్ధం చేయాలి. వారందరికీ వ్యక్తిగత నైపుణ్యాలు కూడా ఇవ్వడం ముఖ్యం. విజయవంతమైన సామాజిక పరస్పర చర్యల కోసం సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు, విద్యార్థులను ఎంతో విలువైన సహచరులుగా, ప్రభావవంతమైన టీమ్ మెంబర్లుగా మార్చి సమష్టిగా పోరాడి, పరిష్కార మార్గాలను వ్యతికే వ్యక్తులుగా సిద్ధం చేయాలి.
చిన్న పిల్లలు ఎక్కువగా సమూహంలో ఉన్నప్పుడు ఎక్కువగా నేర్చుకోవడానికి వీలు అవుతుంది. బోధనా పద్ధతులలోనూ, సమూహ మూల్యాంకనాలు, పీర్ ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లు, ఒక బృందంగా ఏర్పడి పోరాడడం, సహకార అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడం అవసరం. కమ్యూనికేషన్ పరంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. చర్చలు, దౌత్యం, న్యాయమైన బేరసారాలు, మధ్యవర్తిత్వం, AI ప్రాబల్యం కారణంగా మానవులు ప్రధానంగా మానవ సంబంధాల-ఆధారిత ఉద్యోగాలలో నిమగ్నమై.. కీలకమైన నైపుణ్యాలను బోధించడంపై దృష్టి పెట్టాలి. సహకారం, కమ్యూనిటీ బిల్డింగ్ వంటివి ఎంతో ముఖ్యం. విద్యార్థులను వృత్తిపరమైన రంగాలకు మాత్రమే కాకుండా సాంకేతికత వైపు కూడా వెళ్లేలా బాల్యం నుండి సన్నద్ధం చేయాలి.
AI కంటూ ప్రత్యేకమైన సామర్థ్యం, సత్తా ఉన్నప్పటికీ.. సమస్యల పరిష్కారాలకు సంబంధించి మాత్రం మనిషి ఆలోచన వేరేగా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. సమస్యను పరిష్కరించడంలో మనిషి మైండ్ సెట్ కూడా భిన్నంగా ఆలోచిస్తుంది. అందువల్ల, పిల్లలను కేవలం డిజిటల్ ప్రపంచానికి కాకుండా సామాజిక ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలి. NEP (2020) సానుభూతి, సంఘర్షణల పరిష్కారం, పరిశీలన/అశాబ్దిక నైపుణ్యాలను అభ్యసించడం వంటి పాఠ్యాంశాల్లో ప్రజల-కేంద్రీకృత కార్యకలాపాలను చేర్చడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
AI ఆవిష్కరణను ప్రశంసిస్తున్నా ఇది మానవ సృజనాత్మకత నుండి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సృజనాత్మక నైపుణ్యాలు, ఆసక్తికరమైన అన్వేషణ, సమస్యల పరిష్కారం, లాభదాయకమైన నైపుణ్యాలు ఇవి విద్యార్థులను మెరుగవ్వడానికి ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటాయి. అటువంటి సృజనాత్మక విద్యా విధానాలలో 5Cలను చేర్చడం వల్ల విద్యార్థులకు విభిన్న రంగాలు, నిపుణులు, వృత్తి శిక్షణా కార్యక్రమాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, AIకి వ్యతిరేకంగా వారి కెరీర్లను సిద్ధం చేయడానికి వీలవుతుంది.
భవిష్యత్ కోసం పిల్లలను సిద్ధం చేయడం:
కృత్రిమ మేధస్సు పరిమాణం సూత్రంపై పనిచేస్తుంది. దీని శిక్షణ అనేక రంగాలలో ప్రాథమిక నైపుణ్యాల సముపార్జనపై దృష్టి పెడుతుంది. ఇది ముందుగా ఉన్న ప్రోగ్రామింగ్ సిస్టమ్‌లను అనుసరించి పని చేస్తుంది. ఇప్పటి వరకు వాటికి ఉద్యోగానికి సంబంధించి సంక్లిష్టత, ఖచ్చితత్వం, సంపూర్ణత గురించి ఏఐకి అవగాహన లేదు. సమస్య వస్తే వెంటనే స్పందించడం, వేగంగా రియాక్ట్ అవ్వడం వంటివి మనిషికి ఉంటాయి కానీ ఏఐకి ఉండవు. పలు రకాల నైపుణ్యాలు ఉండడం.. భవిష్యత్తులో సాంకేతికంగా ఆధిపత్యం చెలాయించే ప్రపంచంలో ముందుగానే పిల్లలను సిద్ధం చేయడమే కాకుండా వారి సామర్థ్యాలను గుర్తించి.. వాటిని విస్తరించడంలో సహాయపడాలి. పాఠ్యపుస్తకాలకు మించిన బోధనలు, సాధనాల ద్వారా ఉత్సుకత, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను పిల్లలకు అందించాలి. పిల్లలను నిపుణులుగా తయారు చేయడానికి అన్ని అంశాలలో శిక్షణని ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.
నైపుణ్యాభివృద్ధిపై NEP ప్రాధాన్యతను ఇస్తుంది. విద్యార్థులను ఆ దిశగా ముందుకు తీసుకుని వెళ్తుంది. 2025 నాటికి, విధాన రూపకర్తలు ప్రాథమిక, మాధ్యమిక విద్య నేర్చుకునే వారిలో కనీసం 50% వృత్తి నైపుణ్యాలను పరిచయం చేయాలి. అందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, లోక్విద్య (స్వదేశీ నైపుణ్యాలు)ను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. చిన్న వయస్సులోనే ఆన్-ఫీల్డ్ వ్యాపారాలు, నిపుణులతో పరస్పర చర్యకు అవకాశాన్ని కల్పించాలి. అటువంటి ఆచరణాత్మక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నిర్దిష్ట కార్యాచరణతో వెళితే మంచి ఫలితాలను సాధించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎదుర్కొనేలా సన్నద్ధం చేయొచ్చు. మొత్తంమీద, AIని ఎదుర్కోడానికి విద్య, అవగాహన, సహకారం, న్యాయబద్ధత, ప్రాప్యత, లోకల్ ఎంగేజ్మెంట్ వంటి బహుముఖ విధానం అవసరం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, మరింత సమగ్రమైన, సమానమైన AI పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి వీలు కలుగుతుంది.
ఇక్కడ పేర్కొన్న సంపూర్ణ నైపుణ్యాలు సురక్షితమైన భవిష్యత్తు కోసం అత్యవసరం, ప్రత్యేకించి మానవ శ్రమ, సహకారం వంటి వాటిని కృత్రిమ మేధస్సు ద్వారా భర్తీ చేసిన సమయాల్లో చాలా ముఖ్యం. అనవసరమైన సాంప్రదాయిక వృత్తికి బదులుగా భవిష్యత్తు కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడానికి విద్య, వృత్తిపరమైన శిక్షణపై మన దృష్టిని కేంద్రీకరించడం చాలా అవసరం. 21వ శతాబ్దపు నైపుణ్యాలకు తగిన వెయిటేజీతో ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వాలి.. పాఠ్యాంశాల్లో తగిన మార్పులు కూడా చేయాలి. ఉపాధ్యాయుల కోసం మరింత ప్రమేయం ఉన్న, ప్రయోగాత్మకంగా, రిఫ్లెక్సివ్ శిక్షణను రూపొందించాల్సిన అవసరం ఉంది. వారికి శిక్షణను ఇవ్వడానికి కేడర్‌ను తీసుకుని రావాలి.
వనరులు:
India Artificial Intelligence Market: Industry Trends, Share, Size, Growth, Opportunity and Forecast 2023-2028
The Reskilling Revolution: Better Skills, Better Jobs, Better Education for a Billion People by 2030
In principle obstacles for empathic AI: why we can’t replace human empathy in healthcare
NEP2020 - Bridging the skill gap and empowering our youth for a promising future
Reimagining Vocational Education and Skill-building
Next Story