KCR : కారంటే బోరు కొట్టిందా...? ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందా?
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం కేసీఆర్ అన్నది మాత్రం వాస్తవం
కేసీఆర్ పెద్ద స్ట్రాటజిస్టు.. వ్యూహాలు రచించడంలో ఆయనను మించిన వారు లేరు. ఇవన్నీ ఎన్నికలకు ముందు వరకూ ఉన్న మాటలు. పోలింగ్ తేదీనైనా గ్రౌండ్ ను తనకు అనుకూలంగా మార్చుకోగలరన్న సత్తా ఉందన్నది గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తల ధైర్యం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కు ఎన్నికలు పెద్ద కష్టం కాదని వాళ్లు భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ నాయకత్వం లేమి కూడా తమకు కలసి వచ్చే అంశంగా కేసీఆర్ సయితం భావిస్తూ వచ్చారు. అంతే కాకుండా తనకు ఎదురు లేదనే ఆయన భావించారు. అందుకే ఆయన బీజేపీని పెంచడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాను మూడో సారి బయటపడతానని వేసుకున్న అంచనాలు కూడా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఆయనకు మూడోసారి ఓటమిని తెచ్చి పెట్టాయి. గెలిస్తే కేసీఆర్ అంతా తానేనంటూ ఎంతగా క్రెడిట్‌ను సొంతం చేసుకుంటారో...ఓటమిని కూడా ఆయన ఖాతాలో వేయాల్సిందే.