Fri Nov 15 2024 01:37:02 GMT+0000 (Coordinated Universal Time)
ఆమె టాలెంట్ కి ఆనంద్ మహీంద్రా ఫిదా.. పోలీస్ అధికారే కాదు.. మోడల్, బాక్సర్ కూడా
ఫిజికల్ ఫిట్నెస్ కోసం క్లాస్లో చేరమని ఆమె తండ్రి ప్రోత్సహించడంతో.. ఆమె అందులో చేరింది. అంతేకాదు. సిక్కిం తరపున జాతీయ..
ప్రతివిషయంలో తమ సత్తా చాటుతూ.. ఎందులోనూ తమకు తిరుగులేదని చూపుతూ కొందరు తమ ప్రతిభను చాటుతుంటారు. అలాంటి వారిలో సిక్కింకు చెందిన ఏక్షా హంగ్మా సుబ్బా అకా ఏక్షా కెరుంగ్ ఒకరు. 21 ఏళ్ల ఏక్షా ఇప్పుడు సిక్కింలో పోలీసు అధికారి. తాజాగా.. బ్రూట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏక్షా.. తాను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం తన తండ్రి అని చెప్పింది. రుంబుక్ గ్రామంలో పుట్టిన ఏక్షాకు చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. కానీ.. అప్పటికి తమ గ్రామంలో బాక్సింగ్ శిక్షణ అందుబాటులో ఉందని ఆమెకు తెలియదు. తన కలలు, అభిరుచులను తెలుసుకున్న తన తండ్రి.. అవి సాకారం చేసుకునేలా దారి చూపించారని ఏక్షా పేర్కొంది.
ఫిజికల్ ఫిట్నెస్ కోసం క్లాస్లో చేరమని ఆమె తండ్రి ప్రోత్సహించడంతో.. ఆమె అందులో చేరింది. అంతేకాదు. సిక్కిం తరపున జాతీయ టోర్నమెంట్లకు ప్రాతినిధ్యం వహించింది. ఏక్షా కు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని తెలుసుకున్న తండ్రి, సోదరుడు ఆమెను ప్రోత్సహించారు. సోదరుడికి బైక్ నేర్పిస్తున్న క్రమంలో.. తన ఇష్టాన్ని గ్రహించి తనకు కూడా రైడింగ్ నేర్పించారని చెప్పుకొచ్చింది ఏక్షా. 14 నెలలపాటు క్రమశిక్షణలో ట్రైనింగ్ తీసుకున్న ఏక్షా 2019లో సిక్కిం పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సంపాదించింది. కానీ.. ప్రభుత్వ ఉద్యోగంతో తృప్తి పడలేదు ఏక్షా. అది తన కల. కానీ.. తన ప్యాషన్ మరొకటి ఉంది. అదే మోడల్ కావడం.
MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్కి వెళ్లాలనుకుంది. కుటుంబ సభ్యులతో పాటు.. డిపార్ట్ మెంట్ లో ఉన్న సహచరులు, సీనియర్ అధికారుల ప్రోత్సాహం.. మద్దదుతో ఆ దిశగా తొలి అడుగు వేసింది. MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రెండవ సీజన్ కోసం ఆడిషన్ ఇచ్చింది. టాప్ 9 కంటెస్టంట్ గా సెలెక్ట్ అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఏక్షా.. ఒక్కోసారి నన్ను నేను.. నువ్వు ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించుకునేదాన్ని. నీ ప్యాషన్ ఏమైపోయిందని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు.. నేనొక మోడల్ గా అయ్యానంటే నమ్మశక్యంగా లేదు. నేను చాలా అదృష్టవంతురాలిని. ఒక ప్రజాసేవకురాలిగా, పోలీసుగా, మోడల్ గా ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారంటూ.. ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఒక మోడల్ గానే కాకుండా.. పోలీస్ అధికారిగా.. ఈ దేశ పౌరురాలిగా తాను గర్వపడుతున్నానని పేర్కొంది.
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా "ఏక్ష వండర్ వుమన్" అని ప్రశంసించారు. ఆయన సహకారంతో ఆమెకు జావ సంస్థ బైక్ ను అందించింది.
Next Story