Fri Nov 22 2024 12:56:11 GMT+0000 (Coordinated Universal Time)
ఉన్నవే 119 నియోజకవర్గాలు..
యాభైకి పైగా బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కూడా ఇంచుమించు యాభై దక్కించుకుంటుంది. ఏడు ఎమ్ఐఎమ్ ని ఒదిలిపెట్టవు.
యాభైకి పైగా బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కూడా ఇంచుమించు యాభై దక్కించుకుంటుంది. ఏడు ఎమ్ఐఎమ్ ని ఒదిలిపెట్టవు. మిగతా పది పన్నెండు స్థానాల్లో బిజేపి ఏడు ఎనిమిది గెలిస్తే ఓ ఐదు వేవ్‌లో ఏదో ఓ పార్టీకి మొగ్గుతాయి...
జూపల్లి, పొంగులేటి, కుంభం అనిల్, మైనంపల్లి హనుమంత్ రావు వంటివాళ్ళు బీఆర్ఎస్ని దెబ్బతీస్తామని బయలుదేరితే కనీసం ఒక్కరిని కూడా బిజేపి ఆకట్టుకోలేకపోతోంది. బీఆర్ఎస్ లోని అసంతృప్తులందరూ రెబల్స్‌గా పోవాలనో, కాంగ్రెస్‌లోకి పోవాలనో ఆలోచిస్తున్నారు కానీ ఏ ఒక్కరూ బిజేపి వైపు అడుగులు వేయడం లేదు.
బిజేపి కి బీసీ సీఎం ఆయుధం ఉంది.. ముందుముందు చాలా మంది ఆ పార్టీలోకి వచ్చేస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.. కానీ నేటి పరిస్థితులు చూడండి.. ఎవరు మిగిలి ఉన్నారు?
119 నియోజకవర్గాలలో మీరు పనులు చేసుకోండి అని ఏళ్ళకేళ్ళుగా ఎదురుచూస్తున్న నాయకులకి కనీసం భరోసా కూడా ఇవ్వడం లేదు తెలంగాణ బిజేపి. రోజు రోజుకీ పడిపోతున్న బిజేపి గ్రాఫ్ చూసి ఆ పార్టీ నేతలు తమ భవిష్యత్ ఏంటో అని తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీలో పెద్దలు పావులు కడుపుతున్నారు.. ఆగస్ట్‌లో ఊహించని పరిణామాలు ఉంటాయి అన్నారు. ఆగస్ట్ గడిచాక సెప్టెంబర్ అన్నారు.. ఇప్పుడు సెప్టెంబర్ కూడా అయిపోతుండటంతో అక్టోబర్‌లో సంచలనాలు ఉంటాయి అంటున్నారు. పార్టీ కార్యకర్తలని అలా భ్రమలో కొనసాగిస్తూ వెళ్ళడం నిజంగా శోచనీయం.
115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్, ఎక్కడికి అక్కడ గ్రూపు తగాదాలను సరిజేస్తూ టికెట్లను కేటాయిస్తున్న కాంగ్రెస్ పార్టీల ఎఫర్ట్‌లో కనీసం టూ పర్సెంట్ పరిణామాలు కూడా బిజేపిలో జరగడం లేదు. సునిల్ బన్సల్, భూపేంద్ర యాదవ్, తరుణ్ చుగ్‌లు కలిసి నేతృత్వం వహించిన తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలు సప్పసప్పగా ఉన్నాయి. ఆరు నెలల కాలంగా వాళ్ళు చేయించిన సర్వేలలో తేలిన అంకెలే వాళ్ళ అనాసక్తికి కారణమై ఉండవచ్చు అనిపిస్తోంది.
బీఆర్ఎస్ని వీక్ చేస్తూ హంగ్ ఏర్పడే పరిస్థితులు కల్పించి.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కర్నాటక మాదిరి మధ్యంతర ప్రభుత్వం మార్పు చేసుకోవడం బెటర్ అని మిన్నకుండిపోయారా ఆ పార్టీ పెద్దలు అనిపిస్తోంది. రాజకీయాలలో సామదానభేదదండోపాయాలు ఉపయోగించవచ్చు. అధికారం దక్కించుకోవడం కోసం కుటిల నీతిని పాటించవచ్చు... కానీ....
పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, కోట్లు ఖర్చుపెట్టి నిశ్చేష్టులుగా నిలిచిన నాయకులను దిక్కుతోచని స్థితిలో ఒదిలేయడం సమంజసం కాదేమో!!
Next Story