Mon Dec 23 2024 07:55:42 GMT+0000 (Coordinated Universal Time)
గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని సీఎం రేవంత్ కు ఆహ్వానం
రాబోయే బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావుకు టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి బుధవారం సచివాలయంలో ఒక వినతిపత్రం సమర్పించారు.
● గల్ఫ్ సంక్షేమానికి బడ్జెట్ కు విజ్ఞప్తి
రాబోయే బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావుకు టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి బుధవారం సచివాలయంలో ఒక వినతిపత్రం సమర్పించారు. సమగ్ర ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మార్చి నెలలో గల్ఫ్ దేశాలు పర్యటించాలని గల్ఫ్ కార్మికులు కోరుతున్నారని భీంరెడ్డి వివరించారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, గల్ఫ్ దేశాల పర్యటన గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళతానని అన్నారు.
Next Story