Revanth Reddy : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... ఎలా కొట్టగలిగామన్నదే...?
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం నల్లేరు మీద నడకలా సాగలేదు. రాజకీయంగా ఆటుపోట్లను ఎదుర్కొన్నారు
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం నల్లేరు మీద నడకలా సాగలేదు. అనేక పార్టీలు మారినా ఒక్క తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాతనే ఆయన కొద్దిగా లైమ్ లైట్ లోకి రాగలిగారు. రేవంత్ లోని చురుకుదనాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించారు. రేవంత్ ను ప్రోత్సహిస్తూ పదవులు కట్టబెట్టారు. మాటల తీరులోనూ... ప్రత్యర్థులను విమర్శించడంలో స్పష్టత... చేతల్లోనూ చిరుతను మించిన వేగం అన్నీ రాజకీయాల్లో అవసరమని భావించిన రేవంత్ ఆ వైపుగానే అడుగులు వేశారు. అవే ఆభరణాలుగా మారి నేడు ముఖ్యమంత్రి పదవి వరకూ తీసుకెళ్లగలిగాయి. నిజంగా రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అవుతానని ఆయన కూడా కలలో ఊహించి ఉండరు కనీసం మంత్రి పదవి దక్కని రేవంత్ రెడ్డికి పెద్ద పదవులు వరిస్తాయని కలలో కూడా ఎవరూ అనుకుని ఉండరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కానీ అందరూ నోళ్లు వెళ్ల బెట్టక తప్పని పరిస్థితి.