Tue Nov 05 2024 16:27:31 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డికి అరుదైన గౌరవం
స్వీడన్ దేశంలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశం గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్
స్వీడన్ దేశంలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశం 'గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ ఫెల్లోషిప్'కు హైదరాబాద్ కు చెందిన సీనియర్ ఇన్వెస్టిగేషన్ జర్మలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎంపికయ్యారు.ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎస్‌కేయూపీ నార్వేజియన్ ఫౌండేషన్ ఆయనకు ఫెలోషిప్ అందజేస్తున్నది. పరిశోధనాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహించేందుకు ఎస్‌కేయూపీ పనిచేస్తున్నది. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగనున్నది. సమాజంలోఅవినీతి, అక్రమాలను అరికట్టేలా ప్రజలను చైైతన్యపరిచేందుకు అవసరమైన సరికొత్త పద్ధతులపై 150 సెషన్స్ సమావేశాల్లో నిర్వహించనున్నారు.
స్వీడన్ దేశంలోని గోథెన్‌బర్గ్‌లో సెప్టెంబర్ 19నుండి 22 వరకు జరుగనున్నాయి. దక్షిణ స్వీడన్‌లోని ఫోజ మీడియా ఇన్ట్సిట్యూట్ లిన్నెయస్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలలో సమాజంలోని అవినీతి, అక్రమాలను అరికట్టేలా ప్రజలను చైతన్యపరిచేందుకు అవసరమైన సరికొత్త పద్దుతులపై 150 సెషన్స్ నిర్వహిస్తారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అనుసరించాల్సిన పద్దతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కాన్ఫరెన్స్‌లో టెక్నిక్‌లు, అత్యాధునిక వర్క్‌షాప్‌లు, విస్తృతమైన నెట్వర్కింగ్, టూల్స్ వంటి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుండి 2వేల మంది హాజరు కానున్నారు. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశానికి తెలుగు వారైన జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఎంపిక అవ్వడం తెలుగు జర్నలిస్టులకు గర్వకారణం.
గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్వర్క్ (జిఐజెఎన్) ప్రపంచంలోని పరిశోధనాత్మక రిపోర్టర్లకు అంతర్జాతీయ కేంద్రంగా పనిచేస్తుంది, 90 దేశాలలో 244 సభ్యుల లాభాపేక్షలేని సంస్థలు ఉన్నాయి. ఈ సిబ్బంది ప్రతిరోజూ వివిధ భాషలలో పని చేస్తారు, వాచ్డాగ్ రిపోర్టర్లకు అధికార దుర్వినియోగం, జవాబుదారీతనం లేకపోవడం వంటి సాధనాలు, సాంకేతికత శిక్షణను అందిస్తారు. ఫోజో మీడియా ఇన్స్టిట్యూట్ (ఫోజో).. దక్షిణ స్వీడన్‌లోని లిన్నెయస్ విశ్వవిద్యాలయంలో ఉంది. జర్నలిజం, మీడియా బలోపేతాకి, విలువలతో కూడిన ప్రమాణాలు పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో కలిసి పని చేస్తుంది. సుస్థిరమైన ప్రజాస్వామిక ప్రపంచానికి దోహద పడుతుంది.
ఫొరెంనిజెన్ గ్రావాండే జర్నలిస్ట్ (ఎఫ్జిజె), స్వీడిష్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఒక లాభాపేక్షలేని సంస్థ. జర్నలిస్టుల మధ్య విజ్ఞాన భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే కోర్సులు, సెమినార్లను అందించడం అసోసియేషన్ లక్ష్యం. లోతైన అధ్యాయనం, విశ్లేషనతో కూడిన విమర్శనాత్మక జర్నలిజం వైపుకు జర్నలిస్టులు మొగ్గు చూపేలా వారిలో ప్రేరణ కల్పించేందుకు అంకిత భావంతో ఈ సంస్థ పనిచేస్తుంది.
గ్లోబల్ కాన్ఫరెన్స్ 2001లో తొలిసారిగా కోపెన్‌హాగన్‌లో జరిగింది. దీనికి జిఐజెసి 140 దేశాల నుండి 10,000 కంటే ఎక్కువ మంది జర్నలిస్టులను ఒకచోట సమీకరించడం గొప్ప విషయం. అప్పటి నుండి ప్రతి రెండు ఏళ్ళకు ఒకసారి సమావేశం జరుగుతుంది. రియో డి జెనీరో 2013లో జరిగిన 8వ జిఐజె కాన్ఫరెన్స్ దక్షిణార్ధగోళంలో మొదటిది కాగా.. 2015లో లిల్లీహామర్లో జరిపిన సమావేశం ఆఫ్రికాలో మొదటిదిగా చెప్పాలి. అనంతరం వరుసగా జోహన్నెస్‌బర్గ్, హాంబర్గ్‌లో జరిగాయి. 2021 నవంబర్‌లో కోవిడ్ కారణంగా ఆన్లైన్లో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుండి 22 వరకు స్వీడన్‌లోని గోథెన్బర్గ్ నగరంలో జరిగే చారిత్రాత్మకమైన జిఐజెసికి సుధాకర్ రెడ్డి హాజరుకావడం తెలుగు ప్రజల అదృష్టంగా భావించాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ హ్యూగో వాన్ మోస్ట్ వాంటెడ్ ఎన్విరాన్మెంటల్ క్రిమినల్ షాహుల్ హమీద్‌పై జరిపిన పరిశోధనాత్మక కథనాన్ని అల్ జజీరా ఛానెల్లో ప్రసారం చేయడం పరిశోధనాత్మక జర్నలిజంలో ఉడుముల సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించాలి. సుధాకర్ రెడ్డి బ్లడ్ సాండర్స్ ది గ్రేట్ ఫారెస్ట్ హిస్ట్ అనే పుస్తకాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పరిశోధనాత్మకంగా రాశారు. ప్లానెట్ కిల్లర్ సిరీస్‌లో భాగంగా ఇది మొదట ఫెంచ్లో ఉంది. ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ షాహుల్ హమీద్ ఆచూకీ కోసం సింగపూర్, దుబాయ్, హైదరాబాద్, చెన్నై, తిరుపతి, జవాదు కొండలు, విజయవాడ, సెస్చలం అడవుల్లో అన్వేషణ చేపట్టారు. పలువురు ఇంటర్‌పోల్, డీఆర్ఐ, టాస్క్‌ఫోర్స్, ఏపీ పోలీసు అధికారులు అటవీశాఖాధికారులు, స్మగ్లర్లను విచారించారు. ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ఈ డాక్యుమెంటరీ.
Next Story