కాంగ్రెస్ పార్టీ లో స్నోబాల్ ఎఫెక్ట్ మొదలైందా?
గ్రామస్థాయిల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో ఈ పరిణామాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో మహిళా నేతలు, ముఖ్యంగా మున్సిపల్
రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు అని తెలిసిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ లో ఓ కొత్త వేవ్ మొదలైంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తమ పార్టీ కి తిరిగి మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ జోష్ చూస్తూ ఉంటే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు నిశ్చయం అన్నంత కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నాంపల్లి లోని గాంధీభవన్ నేతలతో, ఆశావహులతో కీటకితలాడుతోంది. ప్రతిరోజు చేరికలు, కొత్త ప్రణాళికలు, వ్యూహరచనలతో పార్టీ ఆఫీస్ బిజీబిజీగా సాగుతోంది. ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రజా ప్రతినిధులు, నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలు ఒకరినొకరు పోటీ పడి జాయినింగ్స్ చేయిస్తున్నారు. ఈ చెరికలతో పాటు స్వచ్చందంగా పార్టీ వైపు వస్తున్నవాళ్ళ సంఖ్య కూడా తక్కువలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పై ఏర్పడ్డ వ్యాక్యూమ్ తో ఇన్నాళ్ళూ దిక్కుతోచక కూర్చున్న చాలామంది ఔత్సాహికులకి కాంగ్రెస్ దివ్యౌషధంగా కనిపిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, వివిధ పార్టీల మండలాధ్యక్షులు క్యూ లైన్ కట్టి మరీ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు.