Tue Nov 05 2024 19:49:31 GMT+0000 (Coordinated Universal Time)
Red Sanders : నిపుణుల కమిటీ సమావేశానికి ప్రేత్యేక ఆహ్వానితునిగా సీనియర్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల
భారతదేశంలో అత్యంత విలువైన ఎర్రచందనం కలప పరిరక్షణకు సీనియర్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత విలువైన ఎర్రచందనం కలప పరిరక్షణకు సీనియర్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అందులో గొప్ప పురోగతిని సాధించారు. చెన్నైలోని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (ఎన్.బి.ఎ.) రెడ్ సాండర్స్‌పై నిపుణుల కమిటీ మొదటిసారిగా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. భారతదేశం జీవ వైవిధ్యంపై పని చేస్తున్న అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ ఎన్.బి.ఎ..
మన దేశంలో జీవవైవిధ్యం సతుల్యతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ సూచనలు, సలహాలు అందజేస్తుంది. ఐఎఎస్, ఐఎఫ్ఎస్, శాస్త్రవేత్తలతో పాటు వివిధ శాఖలకు చెందిన ముఖ్య వ్యక్తులు హాజరైన ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన స్వీయ అనుభావాలను, సవాళ్లను పంచుకున్నారు. ఎర్రచందనం పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించే విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎర్రచందనం సంరక్షణకు దృష్టి సారించే అంశాలపై సుధాకర్ రెడ్డి చేసిన సూచనలు, సలహాలకు మంచి స్పందన లభించింది.
ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్, రాజీవ్ మాథ్యూతో సహా ఇతర నిపుణులు హాజరయ్యారు.
నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (ఎన్.బి.ఎ) నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంపై సుధాకర్ రెడ్డి ఉడుముల హర్షం వ్యక్తం చేశారు. తన ప్రతిభను, ఎర్ర చందనం పరి రక్షణకు చేసిన రాజీలేని పోరాటాన్ని గుర్తించి.. ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు సుధాకర్ రెడ్డి ఉడుముల. అరుదైన జాతికి చెందిన వృక్ష సంపదైన ఎర్రచందనాన్ని కాపాడాలనే తన తాపాత్రయాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు అర్థం చేసుకున్నారని అన్నారు. నిపుణుల కమిటీ మొదటి సమావేశంలో ప్రెజెంటేషన్ చేయమని ఎన్.బి.ఎ. కోరడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
Next Story