Sat Nov 23 2024 02:06:28 GMT+0000 (Coordinated Universal Time)
జర్నలిస్టులకు గూగుల్ ఇనీషియేటివ్ ట్రైనింగ్
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం వంటి ఐదు రాష్ట్రాలలో
హైదరాబాద్, 8 సెప్టెంబర్ 2023: ది గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ ఇండియా ట్రైనింగ్ నెట్వర్క్.. డేటాలీడ్స్(DataLEADS), ఇన్ ఓల్డ్ న్యూస్(In Old News) ల సహకారంతో హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీలో 'పోల్చెక్ ఎలక్షన్ అకాడమీ 2023' మొదటి సెషన్‌ను నిర్వహించింది. అధునాతన ఎన్నికల రిపోర్టింగ్ నైపుణ్యాలతో జర్నలిస్టులను సన్నద్ధం చేసి శిక్షణాకార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం వంటి ఐదు రాష్ట్రాలలో పోల్చెక్ ఎలక్షన్ అకాడమీ 2023 శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. త్వరలో భారతదేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలను కవర్ చేసే జర్నలిస్టులు, న్యూస్‌రూమ్‌లకు అవసరమైన సాధనాలు, నైపుణ్యాలను సేకరించడానికి, ధృవీకరించడానికి, సరికొత్త కథనాలను అందించడానికి తోడ్పాటును ఇస్తుంది. అనుభవజ్ఞులైన జర్నలిస్టుల నేతృత్వంలో పలు విషయాలపై ఈ సెషన్ లో ఆన్లైన్ వెరిఫికేషన్, వీడియో స్టోరీటెల్లింగ్, డిజిటల్ సేఫ్టీ, న్యూస్ ఫర్ న్యూస్, మీడియా లిటరసీ, డేటా జర్నలిజం వంటి అంశాలపై చర్చించారు.
హైదరాబాద్ లో PollCheck 2023 సెషన్ లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్), GNI-ఇండియా ట్రైనింగ్ నెట్వర్క్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఉడుముల డిజిటల్ ఇన్వెస్టిగేషన్, వెరిఫికేషన్‌పై కీలకోపన్యాసం ఇచ్చారు. ఇన్ ఓల్డ్ న్యూస్ సహ-వ్యవస్థాపకులు సంషే బిస్వాస్, మనోన్ వెర్చోట్ ఎన్నికల సమయంలో వీడియో స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పారు. ఎన్నికల కవరేజీలో మొబైల్ జర్నలిజం ప్రాముఖ్యతను వివరించారు.
ఫ్యాక్ట్లీ వ్యవస్థాపకుడు రాకేష్ దుబ్బుడు డేటా ఆధారిత రిపోర్టింగ్ ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల సమయంలో కీలక సమాచారాన్ని ఎలా నివేదించాలి అనే అంశంపై సెషన్‌ను నిర్వహించారు. యూట్యూబ్‌లోని కంటెంట్ పార్ట్నర్షిప్ మేనేజర్ రవి రాజ్, యూట్యూబ్ ఫర్ న్యూస్ సెషన్లో ఎన్నికల సమయంలో తక్కువ నిడివి ఉన్న వీడియోలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ముగింపు సెషన్ అయిన 'డిజిటల్ సేఫ్టీ ఫర్ జర్నలిస్ట్స్' కు డేటా అనలిస్ట్, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్లీ & GNI-ఇండియా ట్రైనింగ్ నెట్వర్క్ ట్రైనర్ భరత్ గునిగంటి నాయకత్వం వహించారు. రోజంతా జరిగిన ఈ వర్క్‌షాప్‌లో జర్నలిస్టులు, మీడియా ఎడ్యుకేటర్స్, ఫ్యాక్ట్ చెకర్లు, పరిశోధకులు, డేటా నిపుణులు పాల్గొన్నారు.
GNI ఇండియా ట్రైనింగ్ నెట్వర్క్ లక్ష్యం భారతదేశంలోని జర్నలిస్టులు, మీడియా ఎడ్యుకేటర్లకు డిజిటల్ శిక్షణ, అప్‌స్కేలింగ్ అవకాశాలలో మద్దతు ఇవ్వడం. DataLEADS నేతృత్వంలో, నెట్వర్క్ భారతదేశం అంతటా 15 కంటే ఎక్కువ భాషలలో వేలాది మంది జర్నలిస్టులు, మీడియా ఎడ్యుకేటర్లు, ఫ్యాక్ట్-చెకర్స్, జర్నలిజం విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది.
Next Story