Tue Nov 26 2024 01:51:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : వారినే జగన్ ఎక్కువ తప్పించనున్నారా...? కారణం అందుకే
వైసీపీలో టిక్కెట్ కలకలం కొనసాగుతోంది. ఎవరిని ఎప్పుడు తప్పిస్తారో తెలియకుండా ఉంది. వైసీపీ అధినేత జగన్ అదే పనిలో ఉన్నారు
వైసీపీలో టిక్కెట్ కలకలం కొనసాగుతూనే ఉంది. ఎవరిని ఎప్పుడు తప్పిస్తారో తెలియకుండా ఉంది. వైసీపీ అధినేత జగన్ అదే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన అభ్యర్థులను పెద్దయెత్తున మార్చాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు కూడా అవే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను 66 నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. అందుకే అంతటి విజయం సాధ్యమయిందని నమ్ముతున్నారు. అందుకే ఈసారి కూడా అదే స్ట్రాటజీతో వెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది. ఎక్కువగా కొత్త ఫేస్ లను జనాల వద్దకు తీసుకెళితే వాళ్లు మరోసారి ఆశీర్వాదిస్తారని భావిస్తున్నారు.
గత ఎన్నికల స్ట్రాటజీనే...
గత ఎన్నికల సందర్భంగా వైసీపీలో తొలిసారి గెలిచి శాసనసభలో అడుగు పెట్టిన ఎమ్మెల్యేలు దాదాపు 66 మంది ఉన్నారు. కేవలం తన ఇమేజ్ తోనే గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా వైసీపీ విజయానికి దోహదం చేశాయని చెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. ప్లస్ లు ఎన్నో మైనస్ లు కూడా అదేస్థాయిలో ఉండటం సహజం. కొందరు జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే జగన్ ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మందికి ఈసారి టిక్కెట్లు రావన్న ప్రచారం జరుగుతుంది.
పనితీరు బాగానే ఉన్నా...
అయితే కొందరి యువ ఎమ్మెల్యేలల పనితీరు బాగానే ఉన్నా అక్కడ సామాజిక కోణంలో కొందరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ఫస్ట్ టైం గెలిచినా పెద్దగా పట్టు సంపాదించుకోకపోవడం కూడా వారికి మైనస్ గా మారింది. దీంతో పాటు సర్వే నివేదికలు కూడా వారికి నెగిటివ్ వచ్చాయని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలపై జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకపోవడం కూడా ఈ వ్యతిరేకత కారణంగా చెబుతున్నారు. తొలి సారి ఎన్నికైన 66 మంది ఎమ్మెల్యేలలో సింహభాగం టిక్కెట్లు దక్కడం కష్టమేనని అంటున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా జాబితాను వైసీపీ ప్రకటించింది. వైసీపీ ఇన్ ఛార్జులను నియమించింది. అందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
రెండు జాబితాల్లో...
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరంగి శ్రీనివాస్, కల్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్, పెనుకొండ నుంచి శంకరనారాయణ, కదిరి నుంచి సిద్దారెడ్డి, సంతనూతలపాడు నుంచి సుధాకర్ బాబు, చిలకలూరి పేట నుంచి విడదల రజని, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటి బాబు, రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పాడేరు నియోజకవర్గం నుంచి భాగ్యలక్ష్మి, అరకు నియోజకవర్గం నుంచి చెట్టి ఫాల్గుణ, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్ నాథ్, గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి వంటి వారిని తప్పించారు. వీరిలో కొందరిని ఇతర నియోజకవర్గాలకు పంపగా, మరికొందరిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. కొందరికి పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా నియమించారు.
జిల్లాల వారీగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు వీరే
జమ్మలమడుగు - సుధీర్ రెడ్డి
బద్వేలు -దాసరి సుధ
కడప - అంజద్ బాషా సాహెబ్ బేపరి
చిత్తూరు - ఆరంగి శ్రీనివాస్
పూతలపట్టు - ఎంఎస్ బాబు
పలమనేరు - ఎన్. వెంకటయ్య గౌడ
మదనపల్లె - నవాజ్ బాషా
తంబాళపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి
సత్యవేడు (ఎస్సీ) - కె.ఆదిమూలం
తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం అర్బన్ - అనంత వెంకటరామిరెడ్డి
కళ్యాణదుర్గం - కె.వి.ఉషశ్రీ చరణ్
సింగనమల (ఎస్సీ) - జొన్నగడ్డల పద్మావతి
గుంతకల్లు - యల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి
రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పెనుకొండ - మెలగుండ్ల శంకరనారాయణ
కదిరి - డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డి
పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
కర్నూలు - హఫీజ్ ఖాన్
పత్తికొండ - కె. శ్రీదేవి
కొడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సుధాకర్ బాబు
నంద్యాల - శిల్పా రవిచంద్రారెడ్డి
ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) - ఆర్థర్
గూడూరు (ఎస్సీ) - వరప్రసాద్
సంతనూతలపాడు - టీజేఆర్ సుధాకర్ బాబు
దర్శి - మేడిశెట్టి వేణుగోపాల్
మార్కాపురం - కేపీ నాగార్జున రెడ్డి
కనిగిరి - బుర్రా మధుసూదన యాదవ్
పొన్నూరు - కిలారి రోశయ్య
తాడికొండ - ఉండవల్లి శ్రీదేవి
తెనాలి - అన్నాబత్తుని శివకుమార్
పెద్దకూరపాడు - నంబూరి శంకర్ రావు
చిలకలూరిపేట - విడుదల రజని
వినుకొండ - బోల్ల బ్రహ్మనాయుడు
గురజాల - కాసు మహేశ్ రెడ్డి
కైకలూరు -దూలం నాగేశ్వరరావు
అవనిగడ్డ - రమేశ్ బాబు సింహాద్రి
పామర్రు - కాయల అనిల్ కుమార్
నందిగామ - మొండికోట జగన్మోహన్ రెడ్డి
మైలవరం - వసంతకృష్ణ ప్రసాద్
దెందులూరు - కొటారు అబ్బాయ్ చౌదరి
చింతలపూడి(ఎస్సీ )- వీఆర్ ఐజా
ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు
ఉండి - పీవీఎల్ నరసింహరావు
నిడదవోలు - జీఎస్ నాయుడు
గోపాలపురం(ఎస్సీ) - తలారి వెంకట్రావు
రామచంద్రాపురం - శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చెల్లుబోయిన
Next Story