Mon Dec 23 2024 03:41:09 GMT+0000 (Coordinated Universal Time)
డిజిటల్ పేరెంటింగ్ అంటే ఏమిటి?
డిజిటల్ పేరెంటింగ్ అనేది ఆన్లైన్ ప్రపంచాన్ని ఎలా వాడుకోవాలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించే
డిజిటల్ పేరెంటింగ్ అనేది ఆన్లైన్ ప్రపంచాన్ని ఎలా వాడుకోవాలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించే మార్గదర్శకత్వం, పర్యవేక్షణకు సంబంధించింది. ఆన్లైన్ సేఫ్టీ గురించి వారికి అవగాహన కల్పించడం, డిజిటల్ స్క్రీన్ లను వాడే విషయమై పరిమితులను సెట్ చేయడం, బాధ్యతాయుతమైన, నైతిక డిజిటల్ ప్రవర్తనను ప్రోత్సహించడం వంటివి ఇందులో ఉంటాయి. తల్లిదండ్రుల ప్రమేయం కారణంగా పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
తల్లిదండ్రులలో ఉండే వివిధ రకాలు:
1) పిల్లలకు కూడా అధికారాలు ఇవ్వడం
ఇది ఆదర్శవంతమైన పేరెంటింగ్ స్టైల్ - ఇది మీ పిల్లల కోసం సరిహద్దులను సెట్ చేయడం, వారికి ఎదగడానికి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటాయి.
* నా పిల్లల డిజిటల్ స్థితిస్థాపకతను నిర్మించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది?
* వాళ్ల కంటే పెద్దవారికి పిల్లల ఆన్లైన్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే అనుభవం ఉందని చెప్పడం ద్వారా మీరు మార్గదర్శకంగా ఉంటారు.
* మీరు మీ పిల్లల అభిప్రాయాలను వినడానికి, వారి భావాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.
* మీరు మీ పిల్లలకి అదుపులో ఉండాలనే భావన కలిగించాలి. మీ పిల్లలు రిస్క్ తీసుకోవడానికి వీలు కల్పించేలా భద్రతా భావాన్ని కలిగి ఉండేలా చూసుకోండి.
* మీరు వారి స్వంత ఆన్లైన్ ప్రపంచాన్ని నావిగేట్ చేయడానికి వారికి నియంత్రణను ఇస్తున్నారు కానీ సరైన రక్షణలను అందించి వారు కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.
2) నేను చెప్పిందే శాసనంఅనే తల్లిదండ్రులు
'నేను చెప్పిందే మాట.. నా మాటే శాసనం' అనే తల్లిదండ్రుల శైలి సవాలుగా మారవచ్చు?
* పిల్లల అవకాశాలను తగ్గించడం, వారిని కట్టడి చేయాలని ప్రయత్నించడంతో అనుబంధాలు దెబ్బతింటాయి.
* నేను భిన్నంగా ఏమి చేయగలను? అని ఆలోచించండి.
* మీ పిల్లల మాటలు వినడానికి ఎక్కువ సమయం కేటాయించండి.
* వారు ఏమి చేస్తున్నారో వాటిని పరిశీలించండి.
* వారి జీవితాలు ఎలా ఉన్నాయి.. ఎలా ఉండబోతున్నాయి లాంటివి చెప్పండి.
3) అనుమతి ఇచ్చే తల్లిదండ్రులు
మీరు మీ పిల్లల బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఇదే మంచి మార్గం.
* పిల్లల ఆత్మగౌరవం హద్దులు, ఉన్న అంచనాలపై ఆధారపడి ఉంటుంది. వారికి ఎటువంటి హద్దులు లేకుంటే సమస్యాత్మకంగా ఉంటుంది. వారు తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా ముఖ్యమే..!
* నేను భిన్నంగా ఏమి చేయగలను?
* సరిహద్దులను నిర్ణయించడం, నియమాలను పాటించేలా చేయండి.
* ఆన్లైన్ ప్రవర్తనపై మీ అంచనాలు, వారు ఆన్లైన్లో ఏమి తెలుసుకుంటున్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు నియమాలను ఎందుకు పెడుతున్నారో వివరించండి.
* మీ పిల్లలు మీరు చెప్పేది ఇష్టపడరని భయపడకండి, మీరు తల్లిదండ్రులుగా వారిని ఆన్లైన్లో సురక్షితంగా ఉంచాలి.
(4) నిర్లక్ష్యం
మీరు మీ పిల్లలను పూర్తిగా విడిచిపెట్టడం ఎన్నో విపత్కర పరిణామాలకు దారి తీస్తుంది. వారు ఏమి చేస్తున్నారో తెలుసుకోండి.. పెద్ద సవాలుగా అనిపించకపోవచ్చు? తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా ఉంటే.. పిల్లలు తమకు నచ్చిన పని చేసుకుని వెళ్లేలా అవుతుంది. ఆన్లైన్ లో పిల్లలు సమస్యలు ఎదుర్కోడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు భిన్నంగా ఏమి చేయగలరు?: -
* మీ పిల్లల కోసం, వారి ఆన్లైన్ ప్రపంచం కోసం సమయాన్ని సృష్టించండి
* వారు ఆన్లైన్లో ఏమి చేస్తున్నారో తెలుసుకోండి
* క్రమం తప్పకుండా మాట్లాడండి, మీరు మీ పిల్లల కోసం కొన్ని కొన్ని సార్లు మానసిక వైద్యుడు లేదా క్లాస్ టీచర్ లేదా సామాజిక కార్యకర్తలతో మాట్లాడవలసి రావచ్చు.
పిల్లలపై సాంకేతికత ప్రభావం:-
* కంప్యూటర్, లాప్టాప్, మొబైల్ వంటివి నిరంతరం ఉపయోగించడం, వివిధ ప్లాట్‌ఫారమ్‌లపై ఆటో-ప్లే వంటి ఫీచర్లు అలవాటుగా మారవచ్చు. పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైమ్‌కు కేటాయించవచ్చు.
* మాటలు ఆలస్యంగా వస్తూ ఉండడం
* దృష్టి లోపం
* లెర్నింగ్ ప్రాసెస్ లో సమస్యలు
* చిన్ననాటి నుండే డిప్రెషన్
* మెదడుపై ప్రభావం
* స్క్రీన్లు పిల్లల మెదడుపై డ్రగ్స్ లాంటి ప్రభావాన్ని (స్మార్ట్‌ఫోన్ అడిక్షన్) కలిగి ఉంటాయి, ఇది వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
* సమాచారాన్ని చూసేందుకు Google, GPS, క్యాలెండర్ అలర్ట్‌ల వంటి వాటిపై ఆధారపడటం వలన పిల్లలకు మరింత మతిమరుపు వస్తుంది. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడం కూడా వారికి కష్టమవుతుంది.
* నిద్రపై ప్రభావం
* ఫోన్ల నుండి వచ్చే బ్లూ లైట్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది
స్క్రీన్ టైమ్ నియంత్రన యొక్క ప్రయోజనాలు
* పిల్లలకు వారి జ్ఞానాన్ని పెంచుకోడానికి వివిధ రకాల సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు తోడ్పడుతుంది
* టెక్నాలజీ - మన పిల్లలను సామాజిక సంబంధాలకు భౌతిక అడ్డంకులను తొలగిస్తుంది
* టెక్నాలజీ - పిల్లలు వివిధ విషయాలు త్వరగా తెలుసుకోవడానికి మరియు నేర్చుకోడానికి సహాయపడుతుంది
* ఆన్లైన్ గేమ్‌లు, కార్యకలాపాలు సృజనాత్మకతను మెరుగుపరుస్తాయి, టీమ్ ప్లేయర్ గా కూడా మారవచ్చు
* నైపుణ్యాలు మెరుగుపడతాయి
* పిల్లలకు వినోదం లభిస్తుంది
* పోటీలలో గెలవడానికి సంబంధించిన నైపుణ్యాలు మెరుగుపడతాయి
డిజిటల్ సిటిజన్ షిప్:-
* డిజిటల్ సిటిజన్ షిప్, ఇంటర్నెట్ భద్రత అనేది అన్ని వయస్సుల వ్యక్తులకు ఈనాటి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యతగా ఉంది. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ సలహాలు.
* మీ పిల్లల ఆన్లైన్ భద్రత గురించి ఆలోచించడం చాలా ముఖ్యం.
*నియంత్రణలు: చాలా ఇంటర్నెట్ సాంకేతికతలు అంతర్నిర్మిత నియంత్రణలను కలిగి ఉంటాయి, ఇవి మీ పిల్లలు ఆన్లైన్లో గడిపే సమయాన్ని పరిమితం చేయడానికి, పెద్దల కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా ఉండడానికి పరిమితం చేస్తాయి. షాపింగ్, చాటింగ్ వంటి ఫంక్షన్లను స్విచ్ ఆఫ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. చిన్నపిల్లలకు అసౌకర్యాన్ని కలిగించే కంటెంట్‌ను ఎదుర్కోడానికి కంటెంట్ ఫిల్టరింగ్ నియంత్రణలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి.
* యాప్ కొనుగోళ్లలో నిలిపివేయండి: అనేక యాప్‌లు, గేమ్‌లు తమ వినియోగదారులకు యాప్ లోనే కొన్ని కొనుగోలు చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. పిల్లలు మీకు తెలియకుండానే సులభంగా కొనుగోళ్లు చేయవచ్చు. మీరు సెట్టింగ్‌లలో మీ ఫోన్ / గాడ్జెట్లలో యాప్‌లో కొనుగోళ్లను నిలిపివేయవచ్చు.
* విషయాలు తప్పుగా ఉన్నప్పుడు: మీ పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగించే విషయం ఇంటర్నెట్లో కనిపిస్తే ఏమి చేయాలో వారితో మాట్లాడాలి. వారు గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు మీరు వారి దగ్గరికి వచ్చినప్పుడు దాచడానికి ప్రయత్నిస్తున్నారేమో కూడా గమనించాలి.
* మీ పిల్లలతో ఇంటర్నెట్ భద్రత గురించి మాట్లాడండి: ఆన్‌లైన్‌కి వెళ్లినప్పుడు చూడవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలపై మీ పిల్లలతో సంభాషించండి. చిన్న పిల్లలకు ఆన్లైన్ లో పొంచి ఉండే ప్రమాదాల గురించి తెలియదు, కాబట్టి వారు ఎవరితో మాట్లాడతారు, వారు ఆన్లైన్లో ఎలాంటి సమాచారాన్ని పంచుకుంటున్నారో మాట్లాడటం చాలా ముఖ్యం.
* ఫ్యామిలీ ఇమెయిల్‌ను సెటప్ చేయడం: ఆన్లైన్లో కొత్త గేమ్‌లు, వెబ్సైట్లకు సైన్ అప్ చేసేటప్పుడు మీ పిల్లలు ఉపయోగించడానికి కుటుంబ ఇమెయిల్ చిరునామాను (సాధారణ ఇమెయిల్ చిరునామా) సెటప్ చేయండి
* సేఫ్ సెర్చ్: మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో “గూగుల్ సేఫ్ సెర్చ్”ని యాక్టివేట్ చేయడం ద్వారా సెర్చ్ క్వెరీలకు ప్రతిస్పందనగా మీ చిన్నారికి అనుచితమైన కంటెంట్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడండి. పిల్లల కోసం https://www.kiddle.com ని ఉపయోగించండి
* సురక్షితంగా ఆడండి: చిన్నపిల్లల కోసం, గేమ్ అధికారిక వెబ్సైట్లలో పేర్కొన్న వయస్సు పరిమితులను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటూ, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆన్లైన్లో ఆడేందుకు సురక్షితమైన, తగిన గేమ్‌లను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నాము. చాలా గేమ్‌లు రేటింగ్, ఏజ్ బార్లను కలిగి ఉంటాయి, అవి వయస్సుకు తగినవో కాదో మీరు చూసుకోవచ్చు. అంతర్నిర్మిత ఫీచర్‌గా గేమ్‌లో సురక్షిత చాట్ మోడ్ ఉందో లేదో కూడా మీరు తనిఖీ చేయాలి.
తల్లిదండ్రులకు టాప్ టెన్ ఇంటర్నెట్ సేఫ్టీ చిట్కాలు:-
1) సాంకేతికతకు సంబంధించిన అన్ని యాక్సెస్‌లను బ్లాక్ చేయవద్దు. సాంకేతికతను సురక్షితంగా, సానుకూలంగా ఉపయోగించడం నేర్చుకోవడంలో మీ పిల్లలకు సహాయపడండి.
2) మీ పిల్లలకు ఇష్టమైన యాప్‌లు లేదా సైట్లపై ఆసక్తి చూపండి. కొన్ని సమయాల్లో కలిసి చూడండి.
3) తల్లిదండ్రులుగా ఉండండి. బాధ్యత తో వ్యవహరించండి. పరిమితులను సెట్ చేయండి. కంటెంట్ ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించడాన్ని పరిగణించండి.
4) కార్లలో, బెడ్రూమ్లు, భోజనం చేసే సమయాల్లో టెక్ ఫ్రీ జోన్లతో ఫ్యామిలీ టైమ్ ఒప్పందాన్ని సృష్టించండి.
5) మీ పిల్లలకు ఏ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో బహిర్గతం చేయకూడదో / ఓవర్షేర్ చేయకూడదో నేర్పించండి
6) ఆన్లైన్లో సమాచారాన్ని ఫిల్టర్ చేయడం, నావిగేట్ చేయడం నేర్చుకోవడంలో మీ పిల్లలకు సహాయపడండి
7) రివార్డ్‌లు లేదా బహుమతులుగా పరికరాలను ఉపయోగించకుండా మీ పిల్లలతో డిజిటల్ డైలమాలను నావిగేట్ చేయండి.
8) ఆఫ్-స్క్రీన్ సమయం, ఆన్-స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయండి
9) వయస్సు పరిమితులు (ఉదా. 18+) ఉన్న సైట్లకు సైన్ అప్ చేయడానికి మీ చిన్నారికి మద్దతు ఇవ్వకండి.
10) మరింత ఎక్కువగా నేర్చుకోండి, తల్లిదండ్రుల కోసం విశ్వసనీయ వనరులను అన్వేషించండి.
పిల్లల కోసం టాప్ టెన్ ఇంటర్నెట్ సేఫ్టీ చిట్కాలు :-
1) చట్టాలు: అనేక సైట్లు, వెబ్ సాధనాలు 13+ ఉన్నాయి, ఆన్లైన్లో చూపించిన చాలా చిత్రాలు, రచనలు కాపీరైట్ రక్షణలో ఉన్నాయి
2) చర్చ: మీరు ఆన్లైన్లో ఏమి చేస్తున్నారో మీ తల్లిదండ్రులకు చెప్పండి. మీకు ఏదైనా ఖచ్చితంగా తెలియకుంటే మీరు నమ్మే పెద్దలను అడగండి.
3) స్నేహితులు: తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆన్లైన్ స్నేహితులను కలవవద్దు. స్నేహితులు చెప్పే ప్రతిదాన్ని నమ్మవద్దు.
4) గోప్యత: వ్యక్తిగత సమాచారాన్ని ఎల్లప్పుడూ ప్రైవేట్‌గా ఉంచండి: పూర్తి పేరు. చిరునామా, ఫోన్, పుట్టినరోజులు.. వంటివి అన్నీ చెప్పేయొద్దు
5) ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, భవిష్యత్ ఉద్యోగులు చూడకూడదనుకునే వాటిని పోస్ట్ చేయవద్దు
6) ప్రశ్న: మీరు ఆన్లైన్లో చదివిన. చూసే ప్రతిదాన్ని మీరు నమ్మలేరు. చాలా తప్పుడు సమాచారం ఉంది.
7) బెదిరింపు: సైబర్ బెదిరింపు మీకు లేదా మీకు తెలిసిన ఇతర స్నేహితులకు జరుగుతుందని మీరు భావిస్తే ఎవరికైనా చెప్పండి.
8) ఖాతాలు: సరైన ఇమెయిల్ చిరునామా, వినియోగదారుల పేర్లను ఎంచుకొండి. స్ట్రింగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి, వాటిని ఇతరులతో పంచుకోవద్దు.
9) అన్ని సమయాల్లో గౌరవంగా వ్యవహరించండి. ఇతరుల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లనివ్వకండి
10) అన్‌ప్లగ్: మీ ఆఫ్-స్క్రీన్ సమయం, ఆన్-స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయండి. ఆరుబయటకి వెళ్లి క్రికెట్, ఫుట్‌బాల్ మొదలైన శారీరక శ్రమ ఉండే క్రీడలు ఆడండి.
ముగింపు:-
* స్టేటస్ అప్డేట్స్ కంటే ఎక్కువ పుస్తకాలను చదవండి.
* స్క్రీన్లను ఎక్కువగా చూడకండి.
* డిజిటల్ పరికరాలను వీలైనంత తక్కువగా పట్టుకోండి.
Stay tuned to the Cyber Samacharam Column contributed by Anil Rachamalla from the End Now Foundation.
Next Story