Sun Dec 22 2024 15:37:25 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్- బెంగళూరు నగరాల్లో ఏది బెస్ట్?
ఐటి, ఏరోస్పేస్తో సహా అనేక రంగాలలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీని
ఐటి, ఏరోస్పేస్తో సహా అనేక రంగాలలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీని ఇస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరును అనేక అంశాలలో కూడా అధిగమించిందని చెప్పే వాళ్లు ఉన్నారు. పలు బహుళజాతి కంపెనీలు తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను (జిసిసి) ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను ఇష్టపడుతున్నాయని నాస్కామ్ నివేదిక తెలిపింది. ఇక బెంగళూరులో ఉండే ఖర్చులతో పోల్చుకుంటే.. హైదరాబాద్ లో తక్కువ ఖర్చులు కూడా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ రెండు నగరాల్లో ఏది బెస్ట్ అనే వాదన కొనసాగుతూ ఉంది. నెటిజన్లు ఏ నగరం బెస్ట్ అని అనుకుంటూ ఉన్నారో.. ఆ నగరం గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.
చాలా విషయాల్లో హైదరాబాద్ గత 10 సంవత్సరాల్లో మారిపోయిందని నెటిజన్లు అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే కాకుండా.. వివిధ రంగాలకు చెందిన వారికి కూడా హైదరాబాద్ సాదర స్వాగతం పలుకుతూ ఉంది. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, జీవన వ్యయం, శాంతిభద్రతలు, ఇతర అంశాల పరంగా బెంగళూరుతో పోటీ పడుతూ ఉంది. బెంగళూరులో ఉండి హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్న వాళ్లు చాలా మంది హైదరాబాద్ నగరాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. బెంగళూరు నగరంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఖర్చులు తక్కువేనని.. బాగానే సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామని చెబుతూ ఉన్నారు.
బెంగళూరు నగరంలో ముఖ్యంగా అద్దెలు చాలా ఎక్కువే.. ఆ విషయంపై చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో మాత్రమే అద్దెలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో చాలా తక్కువేనని అంటున్నారు. రెండు నగరాల మధ్య వ్యత్యాసం చాలానే ఉందని అంటున్నారు. 2014లో ఉన్న హైదరాబాద్ కు.. 2019కి చాలా తేడా ఉందని నెటిజన్లు ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఈ మధ్య కాలంలో అభివృద్ధిలో గణనీయమైన ప్రగతిని సాధించిందని నెటిజన్లు తెలిపారు. అభివృద్ధి పరంగా అనేక ప్రధాన భారతీయ నగరాల కంటే ముందుందని.. స్కైలైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పట్టణీకరణ వంటి విషయాల్లో చాలానే ఇంప్రూవ్ అయిందని పలువురు చెబుతున్నారు. హైదరాబాద్‌తో పోల్చితే బెంగళూరు వివిధ అంశాల్లో వెనుకబడి ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరులో ఇరుకైన రోడ్లు, మూసుకుపోయిన డ్రెయిన్లు, అస్థిరమైన రోడ్ల విస్తరణ ప్రాజెక్టులు ఉన్నాయని చెబుతున్నారు.
Next Story