యంగిస్తాన్ ఫౌండేషన్: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకుని రావడమే ముఖ్య లక్ష్యం
యంగిస్తాన్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆశాదీపం. 70,000 మంది యువత
యంగిస్తాన్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆశాదీపం. 70,000 మంది యువత, 150+ ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్ల మద్దతుతో, ఈ స్వచ్ఛంద సంస్థ 60 నగరాల్లో 5 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఫౌండేషన్ విజయవంతంగా ఆరోగ్యం, జీవనోపాధి, లింగం, విద్య, వాతావరణం, పర్యావరణంపై దృష్టి సారించే 5 క్రియాశీల అంశాలపై దృష్టి పెట్టింది. ఇవన్నీ UN సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDGలు)కి అనుగుణంగా ఉన్నాయి. ఫౌండేషన్ లో భాగంగా నిరాశ్రయులైన వారికి ఆహారాన్ని అందించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, 60 నగరాల్లో 2 మిలియన్ల మందికి పైగా భోజనాలు అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఆహారం, బట్టలు, ఆసుపత్రులలో వైద్యం, నిరాశ్రయులకు ఆశ్రయం వంటివి అందిస్తూ వస్తున్నారు. 2 మిలియన్ల మందికి పైగా భోజనం అందించారు. 3,000 మంది నిరాశ్రయులైన వ్యక్తులకు కౌన్సెలింగ్ అందించారు. జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయాన్ని అందించే లక్ష్యం నెరవేరుతూ ఉండగా..! స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారి సంఖ్య పెరగడంతో.. యంగిస్తాన్ విద్యా రంగంలోకి కూడా ప్రవేశించింది. పిల్లలకు సంరక్షణ కేంద్రాలు, మురికివాడలలోని పిల్లలకు ట్యూషన్ చెప్పడం వంటివి మొదలయ్యాయి. వెనుకబడిన కమ్యూనిటీలలో అక్షరాస్యతను మెరుగుపరచడం.. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా కార్యక్రమం అభివృద్ధి చేశారు. క్రమంగా ఫౌండేషన్ మహిళా సాధికారత, భద్రత, లింగ సమానత్వంతో సహా ఇతర రంగాలలోకి అడుగు పెట్టింది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, సేఫ్టీ సెషన్లలో వివిధ కార్యక్రమాల ద్వారా యంగిస్తాన్ మహిళలు, యుక్తవయస్కుల వారికి ఉపాధి రక్షణ కల్పిస్తుంది. యంగిస్తాన్ టీమ్ SHE టీమ్లతో అనుసంధానమైంది, LGBTQ+ కమ్యూనిటీకి కూడా తోడ్పాటును అందిస్తోంది. ఆడవారి ఆరోగ్యం, పిల్లల భద్రతకు సంబంధించి పలు కార్యక్రమాలను చేపట్టింది.
యంగిస్తాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అరుణ్ డేనియల్ ఎల్లమటి కుమార్