జగన్ వ్యూహానికి మరోసారి బ్రేకులు.. ఆ పనిజరిగేలా లేదు
ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పేదలకు ఇళ్లు పథకం ఇప్పట్లో ముందుకు సాగేలా కనిపించడం లేదు. నవరత్నాలు పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర [more]
ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పేదలకు ఇళ్లు పథకం ఇప్పట్లో ముందుకు సాగేలా కనిపించడం లేదు. నవరత్నాలు పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర [more]
ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పేదలకు ఇళ్లు పథకం ఇప్పట్లో ముందుకు సాగేలా కనిపించడం లేదు. నవరత్నాలు పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మందికి (ముందు 25 లక్షలే అనుకున్నారు. తర్వాత రెండులక్షలు పెరిగారు). ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బావించారు. బహుశ ఈ పథకం పూర్తయి ఉంటే.. ఈ రేంజ్లో ఒకేదఫా ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఆయనకే సొంతమై ఉండేది. ఈ క్రమంలోనే జగన్ ఆది నుంచి చెబుతున్నట్టు ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీని లక్ష్యంగా చేసుకుని అధికారులను,వలంటీర్లను ఉరుకులు పరుగులు పెట్టించారు.
ఏప్రిల్ 14న ఇద్దామనుకుంటే?
అన్ని జిల్లాల్లోనూ ఇళ్ల స్థలాలను సేకరించారు. లే అవుట్లు కూడా సిద్ధం చేశారు. ఇక, లబ్దిదారులను కూడా ఎంపిక చేశారు. ఉగాది నాడు పెద్ద పండుగ మాదిరిగా జగన్ ఈ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇంతలోనే స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కోడ్ అడ్డం వచ్చింది. సరే అది తొలిగిపోయినా.. కరోనా ఎఫెక్ట్ ముందుకు వచ్చింది. దీంతో పంపిణీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నే జగన్ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఖచ్చితంగా ఆ రోజు పంపిణీ జరుగుతుందని పేదలు అందరూ ఆశలు పెట్టుకున్నారు.
హైకోర్టు అభ్యంతరంతో….
కానీ, ఇప్పుడు ఆ రోజు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు కూడా రెండు కీలక పరిణామాలు అడ్డం వచ్చాయి. ఒకటి హైకోర్టు ఉత్తర్వులు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పేదలకు ఇళ్ల జీవోలను హైకోర్టు కొట్టేసింది. దీనికి కారణంగా.. ఆయా స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలని ఆదేశించడం మానేసి వాటిని ఐదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు ఎలా అనుమతి ఇస్తారని కోర్టు ప్రశ్నించింది. సో ఇప్పుడు మళ్లీ కొత్తగా జీవో తయారు చేసి అమల్లోకి తేవాలి. మరోపక్క, ఇలా జీవో సిద్ధం చేసి, అమరావతి ప్రాంతంలో కేటాయిస్తామని చెప్పిన భూములను పక్కన పెట్టి రాష్ట్రం మొత్తం అమలు చేయాలని నిర్ణయించుకున్నా.. మరో అడ్డంకి ఎదురు చూస్తోంది.
లాక్ డౌన్ నిర్ణయంతో…..
అదే.. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్. దేశవ్యాప్తంగా లాక్డౌన్ మూడు వారాలు పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల అంటే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించింది. అంటే.. అదే రోజు అంబేద్కర్ జయంతి. ఆరోజే జగన్ పేదలకు ఇళ్లు ఇవ్వాలని భావించారు. కానీ, ఇప్పుడు ప్రధాని మోడీ లెక్కల ప్రకారం ఆరోజు కూడా లాక్ డౌన్ ఉంటుంది. సో.. అప్పుడు ఇళ్ల స్థలాల పట్టాలు పంచేందుకు ఛాన్స్ లేదు. దీంతో ఈ వాయిదా కూడా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో ఎప్పుడు ఇస్తారు? అనేది పరిశీలిస్తే.. జూన్ లేదా జూలై నెలలో ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో.. మొత్తానికి జగన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.