Mon Dec 23 2024 00:40:07 GMT+0000 (Coordinated Universal Time)
భారీ స్కోరు దిశగానే?
భారీ స్కోరు దిశగా టీం ఇండియా పయనిస్తుంది. ఆసియా కప్ లో రెండోసారి దాయాదుల మధ్య పోరు ప్రారంభమయింది.
భారీ స్కోరు దిశగా టీం ఇండియా పయనిస్తుంది. ఆసియా కప్ లో రెండోసారి దాయాదుల మధ్య పోరు ప్రారంభమైంది . నిన్న పాక్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో రిజర్వ్ డే కావడంతో ఈరోజు మళ్లీ మొదలైంది . మధ్యాహ్నం మూడు గంటలకు కొలొంబో స్టేడియంలో ప్రారంభం కావాల్సిన మ్యాచ్ మళ్లీ వర్షం కురియడంతో కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే భారత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.
ఇద్దరూ నిలకడగా...
విరాట్ కొహ్లి, కేఎల్ రాహుల్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 38 ఓవర్లకు ఇండియా స్కోరు 236 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఇప్పటికే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 65 పరుగులు చేశాడు. విరాట్ కొహ్లీ 49 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లు ఈ జంటను విడదీయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. మరో పదిహేను ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్ స్కోరు మూడు వందలకు పైగానే దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీం ఇండియా భారీ స్కోరును పాకిస్థాన్ ముందు ఉంచనుంది.
రిజర్వ్ డే రోజు కావడంతో...
నిన్న వర్షం పడటానికి ముందు భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు ఇద్దరూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అవుటయ్యారు. 100 పరుగులకు పైగా కీలక భాగస్వామ్యాన్ని ఈ ఓపెనర్లు జోడించారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కొహ్లి, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. ఈ జంటను విడదీయడానికి పాక్ బౌలర్లు శ్రమిస్తున్నారు. భారీ లక్ష్యాన్ని పాక్ ముందుంచి ఈ మ్యాచ్ లో గెలిచేందుకు టీం ఇండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. నిన్న టాస్ గెలిచిన పాక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది.
Next Story