Mon Dec 23 2024 00:54:25 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ విక్టరీ
ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. దాయాది పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది
ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. దాయాది పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఆసియా కప్ సూపర్ 4 లో అభిమానుల అంచనాలకు మించి ప్రతిభను ప్రదర్శించింది. పాకిస్థాన్ ను వన్డేలో 228 పరుగుల తేడాతో ఓడించింది. భారత్ బ్యాటర్లు, బ్యాటర్లు అందరూ ఫామ్ లోకి రావడంతో పాక్ ఓటమికి తలవంచక తప్పలేదు. మరో 18 ఓవర్లు మిగిలి ఉండగానే పాక్ బ్యాటర్లందరినీ పెవిలియన్ దారి పట్టించింది.
భారీ లక్ష్యమున్నా...
గాయాల కారణంగా ఇద్దరు బ్యాటర్లు బరిలోకి దిగకపోవడంతో ఎనిమిది వికెట్లతోనే తమ పని అయిపోయిందని చెప్పకనే చెప్పింది. వర్షం కారణంగా తొలి రోజు వాయిదా పడిన ఆట రిజర్వ్ డే గా జరిగిన మరుసటి రోజు ప్రారంభమయింది. అప్పటికే భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు అర్ధ సెంచరీలు పూర్తి చేయడమే కాకుండా భారత్ కు మంచి స్కోరు ఇచ్చారు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ను పాకిస్థాన్ బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. దీంతో కోహ్లి 122 పరుగులు, కేఎల్ రాహుల్ 111 పరుగులు చేసి భారత్ కు 356 పరుగులు తెచ్చిపెట్టారు.
స్పిన్ మంత్రంతో...
టాస్ గెలిచిన పాక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని తప్పుచేసినట్లయింది. ఇంతటి భారీ లక్ష్యాన్ని సాధించాలంటే చాలా శ్రమించాలి. కానీ 357 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆదిలోనే తడబడింది. బూమ్రా దెబ్బకు తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా మరొక వికెట్ తీయడంతో ఓపెనర్లను విడదీశారు. 11 ఓవర్లకు 44 పరుగులు చేసి కేవలం రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత మళ్లీ ఆట మొదలయినా చాలా నిదానంగా ఆడాల్సి వచ్చింది. స్కోరు వేగం పెరగలేదు. ఈ పరిస్థితుల్లో శార్దూల్ మరో వికెట్ తీయడంతో పాక్ పతనం ప్రారంభమయింది. ఇక వరసగా పాక్ బ్యాటర్లు ఇంటి దారిపట్టారు. స్పిన్నర్ కులదీప్ యాదవ్ తన మాయాజాలంతో ఐదు వికెట్లు తీయడంతో పాక్ పని అయిపోయింది. దీంతో భారత్ భారీ మెజారిటీతో విజయం సాధించింది.
Next Story