Mon Dec 23 2024 01:01:18 GMT+0000 (Coordinated Universal Time)
కష్టాల్లో టీం ఇండియా
పాకిస్థాన్ పై భారీ విజయాన్ని సాధించి ఊపు మీదున్న టీం ఇండియాకు శ్రీలంక విషయంలో మాత్రం చుక్కలు కనపడుతున్నాయి.
పాకిస్థాన్ పై భారీ విజయాన్ని సాధించి ఊపు మీదున్న టీం ఇండియాకు శ్రీలంక విషయంలో మాత్రం చుక్కలు కనపడుతున్నాయి. లంక బౌలర్లు టీం ఇండియా బ్యాటర్లను ఎక్కువ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. దీంతో టీం ఇండియా సూపర్ 4 లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో పీకల్లోతు కష్టాల్లో పడినట్లయింది.
వరసగా అవుట్...
తొలుత టాస్ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ ఒక్కరే అర్ధ సెంచరీ పూర్తి చేయగలిగారు. విరాట్ కోహ్లి మూడు పరుగులకే అవుట్ కావడంతో టీం ఇండియా శిబిరంలో నిరాశ కన్పించింది. తర్వాత ఇషాన్ కిషన్ కొంత సేపు నిలకడగా ఆడినా భారత్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది.
తక్కువ స్కోరుకే...
ప్రస్తుతం నలభై రెండు ఓవర్లకు టీం ఇండియా 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొమ్మిది వికెట్లను కోల్పోయింది. జడేజా కూడా వెంటనే అవుట్ అయి అభిమానులను నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లు భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో అతి స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచినట్లయింది. దీంతో భారత్ బౌలర్ల మీదే ఆశలు ఉన్నాయి. శ్రీలంక బ్యాటర్లను త్వరగా పెవిలియన్ కు పంపకపోతే పరాజయం పాలయినట్లే. ప్రస్తుతం అక్షర్ పటేల్, బూమ్రా క్రీజులో ఉన్నారు. టీం ఇండియా రెండు వందల పరుగులు చేయడం కూడా కష్టంగా మారింది.
Next Story