Mon Dec 23 2024 00:59:31 GMT+0000 (Coordinated Universal Time)
ట్రెండింగ్‌లో దునిత్
20 ఏళ్ల దునిత్ వెలలాగే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వరస వికెట్లు తీసి శ్రీలంక విజయానికి కారణమవుతున్నాడు
క్రికెట్ లో వికెట్లు తీసిన వాడే మొనగాడు. పరుగులు తీసిన వాడే హీరో. పరుగులు అత్యధికంగా చేసినా ఎక్కువ వికెట్లు తీసినా ఆ ఆటగాడిపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు శ్రీలంక టీంలోని ఒక కుర్రోడి గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ చిన్నోడు ట్రెండింగ్ గా మారిపోయాడు. అతడే శ్రీలంక బౌలర్ దునిత్ వెలలాగే. ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ఎవరీ దునీత్ అంటూ గూగుల్ లో సెర్చ్ చేయడం కనిపిస్తుంది. దునిత్ ఇప్పుడు క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు.
ఇండియాతో...
ఆసియా కప్ ఈసారి శ్రీలంకలో జరుగుతుంది. హోం పిచ్ అని చెప్పలేం కాని ఇరవై ఏళ్ల దునిత్ వెలలాగే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వరసగా వికెట్లు తీసి శ్రీలంక విజయానికి కారణమవుతున్నాడు. పతకాల పట్టికలో శ్రీలంక ఈ స్థానానికి రావడానికి ప్రధాన కారణం దునిత్ వెలలాగే అని చెప్పక తప్పదు. అతను కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరుస్తుండటంతో శ్రీలంక తన గెలుపునకు సులువుగా మారింది. పెద్దగా కష్ట పడకుండానే విజయాలను దక్కించుకుంటుంది.
పన్నెండు వన్డేలు...
దునిత్ వెలలాగే కేవలం పన్నెండు వన్డేలు మాత్రమే ఆడాడు. అతని వయసు ఇరవై ఏళ్లు. ఆసియా కప్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కీలక బ్యాటర్లను పెవిలియన్ కు పంపింది ఈ కుర్రోడే. పందొమ్మిది పరుగులకు శుభమన్ గిల్, మూడు పరుగులకు విరాట్ కొహ్లి, యాభై మూడు పరుగులు చేసి నిలదొక్కుకున్న రోహిత్ శర్మను అవుట్ చేసింది దునిత్ వెలలాగే మాత్రమే. ఈ మ్యాచ్ లో మొత్తం ఐదు వికెట్లు దునిత్ వెలలాగే తీశాడు. ఒకవేళ శ్రీలంక గెలిస్తే ఇతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కే అవకాశాలున్నాయి.
ఐదు వికెట్లు తీసి...
శ్రీలంకకు ఇప్పటికే మూడు విజయాలను అందించి స్పిన్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసుకున్న దునిత్ వెలలాగే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని స్పిన్ మాయాజాలానికి పేరున్న ఆటగాళ్లు చేతులెత్తేయాల్సి వచ్చింది. ఇప్పుుడు శ్రీలంకకు ఒక మంచి యువ బౌలర్ దొరికాడనే అనుకోవాలి. ఆసియా కప్ ముగిసే సమయానికి దునిత్ వెలలాగే మరిన్ని రికార్డులు సృష్టిస్తాడన్నది వేచి చూడాల్సిందే.
Next Story