1983 వరల్డ్ కప్ విజయానికి 40 ఏళ్ళు
1983 వరల్డ్ కప్ ఫైనల్లో అండర్ డాగ్‌గా బరిలో దిగిన భారత జట్టు.. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ చేరింది. భయంకరమైన విండీస్‌తో
లార్డ్స్‌లో ప్రపంచ కప్ ట్రోఫీని పట్టుకున్న కపిల్ దేవ్ చిత్రం ప్రతి భారతీయ క్రికెట్ అభిమానికి జ్ఞాపకమే..! ఈ టోర్నమెంట్ ముందు వరకూ క్రికెట్ అంటే ఏదో ఒక ఆట అని అనుకునేవాళ్లం.. కానీ ఒక్క విజయం భారత్ లో క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. క్రికెట్ ఆటను భారతీయులు కూడా ఎంతో సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. నలభై సంవత్సరాల క్రితం, కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు అసమానతలను ధిక్కరించి, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో ఎంతో శక్తివంతమైన వెస్టిండీస్‌ను ఓడించి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అప్పట్లో ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు కూడా అంతే దారుణంగా ఉండేది. మన వాళ్లకు మంచి హోటల్ రూమ్స్ ఇచ్చే వాళ్లు కాదు.. సరైన భోజనం పెట్టేవాళ్లు కాదు.. ఇలా ఎన్నో కష్టాలను అధిగమించి భారత్ వరల్డ్ కప్ గెలిచి నిలిచింది.