Mon Dec 23 2024 02:14:02 GMT+0000 (Coordinated Universal Time)
Kohli Birthday : భర్తకు బర్త్ డే విషెస్ చెప్పిన అనుష్క శర్మ
నేడు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కోహ్లీ.. నేడు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు విరాట్ పుట్టినరోజు కావడంతో.. క్రీడాకారులతో పాటు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. విరాట్ భార్య.. అనుష్క శర్మ కూడా తన భర్తకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్‌కు విషెస్ చెబుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను షేర్ చేశారు. విరాట్ ఫన్నీగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలను పోస్ట్ చేసిన అనుష్క.. 'మై లవ్ ఈరోజు నీ పుట్టిన రోజు. అందుకే నేను నీ బెస్ట్ ఫొటోలను పోస్ట్ చేశాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. విరాట్ టీ20 5వ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ ను భారత్ సాధించాలని.. అది విరాట్ వల్లే సాధ్యమవుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
Next Story