Fri Dec 20 2024 19:37:21 GMT+0000 (Coordinated Universal Time)
INDvsAFG: ఆ మార్పుతో బరిలోకి దిగిన భారత జట్టు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఆసీస్ తో మ్యాచ్ లో విజయం తర్వాత భారత్ ఈ మ్యాచ్ పై దృష్టి పెట్టింది. మరో రెండు పాయింట్లను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేస్తోంది. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆఫ్ఘనిస్తాన్: రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్కీపర్), హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూకీ
Next Story