Tue Dec 24 2024 03:23:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రెండో వన్డే....అమితుమీకి సిద్ధం
మొదటి వన్డేలో ఘోర పరాజాయాన్ని చవి చూసిన టీం ఇండియా రెండో వన్డేలోనైనా గెలవాలని భావిస్తుంది
మొదటి వన్డేలో ఘోర పరాజాయాన్ని చవి చూసిన టీం ఇండియా రెండో వన్డేలోనైనా గెలవాలని భావిస్తుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు సౌతాఫ్రికా - ఇండియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. పార్ల్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ చేజారడంతో సిరీస్ లో గెలవాలంటే ఈ మ్యాచ్ భారత్ కు కీలకంగా మారనుంది.
టాస్ గెలిస్తే....
టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీం ఇండియా వన్డే సిరీస్ ను అయినా దక్కించుకుని పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ స్టేడియం స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో టీంఇండియాలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఈ మ్యాచ్ లో టాస్ కీలకంగా మారనుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఉంటాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
Next Story