Mon Dec 23 2024 07:28:59 GMT+0000 (Coordinated Universal Time)
అంబటి రాయుడు.. టీడీపీని అనేశాడుగా!!
ప్రముఖ తెలుగు యాంకర్ జాఫర్ తో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
ప్రముఖ తెలుగు యాంకర్ జాఫర్ తో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పలు విషయాలపై చర్చించారు. తన క్రికెట్ కెరీర్ లో జరిగిన చాలా విషయాలపై అంబటి రాయుడు వివరణ ఇచ్చారు. ఇకపై తన పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోందో కూడా చెప్పారు. వైసీపీ సిద్ధాంతాలు తనను ఎలా ప్రభావితం చేశాయి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు కలిశాను అనే విషయాలపై కూడా చర్చించారు. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కులం, భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ కులం ఒకటే కావడంతోనే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రశ్న కూడా ఎదురైంది అంబటి రాయుడుకు..! వీటన్నిటిపైనా చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు రాయుడు.
ఇక ఎంఎస్కే ప్రసాద్ కారణంగానే భారత జట్టులోకి మీరు రీఎంట్రీ ఇచ్చారని ఆయన చెప్పుకుంటున్నారనే ప్రశ్నకు టీడీపీ మీద సెటైర్లు వేశాడు అంబటి రాయుడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ది, చంద్రబాబుది ఒకే క్యాస్ట్ కావడం వల్లే తాను వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని రాయుడు తెలిపారు. 30 ఏళ్ల నుంచి నా క్లోజెస్ట్ ఫ్రెండ్‌ది అదే క్యాస్ట్. వాడు నా కోసం ప్రాణమైనా ఇస్తాడు గానీ ఓటైతే వేయడని అంబటి రాయుడు నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ సమస్యలు ఉన్నప్పుడు నేషనల్ అకాడెమీలో పెట్టడం చాలా కామన్ తప్ప ఒకరు లెటర్ రాయడం కరెక్ట్ కాదని అన్నారు. ఎంఎస్కే ప్రసాద్ ఒక్కరే ఏదో చేశారని నేను చెప్పలేదని.. ఒక్కరిని బ్లేమ్ చేయడంలేదని మాత్రం చెప్పుకొచ్చారు రాయుడు. నేను ప్రపంచ కప్ కు ఆడలేదనే బాధ తప్ప మరేమీ లేదని అన్నారు. తన కోసం ఏదో చేశానని కొందరు చెప్పుకోవడం కరెక్ట్ కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీనే కారణం అన్నట్లుగా ఉందని అంబటి రాయుడు సెటైర్లు కూడా వేశారు. మా తాతయ్య టీడీపీ తరఫున సర్పంచ్‌గా పని చేశారని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆయన చనిపోయిన చాలా కాలం తర్వాత టీడీపీ ఏర్పాటైంది. ఆయన అప్పట్లో స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారని రాయుడు తెలిపారు.
Next Story