Mon Dec 23 2024 13:17:56 GMT+0000 (Coordinated Universal Time)
క్రికిటర్ పృథ్వీషా కారుపై అటాక్.. రీజన్ ఇదే
ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. టీం ఇండియా క్రికెటర్ పృథ్వీషా కారుపై దాడి జరిగింది
ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. టీం ఇండియా క్రికెటర్ పృథ్వీషా కారుపై దాడి జరిగింది. కొందరు కావాలని ఈ దారుణానికి పాల్పడ్డారు. బేస్ బాల్ బ్యాట్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ముంబయిలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ నుంచి పృథ్వీషాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర వచ్చారు. అయితే తమకు సెల్ఫీ ఇవ్వాలంటూ కొందరు యువకులు పృధ్వీషాను గుర్తించి తమతో సెల్ఫీలు దిగాలని కోరారు. అయితే షా అందుకు నిరాకరించాడు. దీంతో డిన్నర్ ముగించుకుని స్నేహితుడితో కలసి హోటల్ నుంచి బయటకు వచ్చిన పృథ్వీషా కారుపై దాడి చేశారు. ఆ కారు తన స్నేహితుడు ఆశిష్ సురేంద్రది.
వెంబడించి మరీ...
ఆయన బీఎండబ్ల్యూ కారును నలుగురు యువతీయువకులు కలసి ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా కొందరు పృథ్వీషా కారును వెంబడించి మరీ వేధించారు. అందులో ఒక యువతి పృథ్వీషాను యాభైవేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులివ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు కూడా. దీంతో పృథ్వీషా పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల్లో ఒకరిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- prithvisha
- car
Next Story