Wed Apr 09 2025 23:50:03 GMT+0000 (Coordinated Universal Time)
India vs Pak Champions Trophy : ఇంకా గంటలే సమయం.. మనోళ్లు ఏం చేస్తారో?
భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఏ ఫార్మాట్ అయినా.. ఎక్కడైనా సరే.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ ఉంటుంది

భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఏ ఫార్మాట్ అయినా.. ఎక్కడైనా సరే.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ ఉంటుంది. దాయాదుల సమరం మామూలుగా ఉండదు. మైదానంలో అడుగు పెట్టిన నాటి నుంచి ఇరుదేశాల అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతుంటారు. ప్రతి రన్ కు,ప్రతి వికెట్ కు తాము ప్రపంచ ఛాంపియన్ అయిపోయినట్లు ఫీలవుతుంటారు. ప్రతి బాల్ కు కేరింతలు.. నినాదాలు.. ఒకటే హోరు.. స్టేడియం మొత్తం నిండిపోతుంది. ప్రపంచంలో ఈ రెండు దేశాల మధ్య ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడకు వెళ్లి మరీ మ్యాచ్ చూసే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాంటి రెండు దేశాల మధ్య మరో హై ఓల్టేజీ మ్యాచ్ ఈ ఆదివారం జరగనుంది.
సండేరోజు కావడంతో...
సండే అంటే అందరికీ సెలవు. దీంతో అదే రోజు ఇండియా - పాక్ మ్యాచ్ ఉండటంతో ఇక చెప్పాల్పిన పనిలేదు. మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ రాత్రి పదిన్నర గంటలకు పైగానే సాగుతుంది. యాభై ఓవర్ల మ్యాచ్ కావడంతో ఎన్నో ట్విస్టులుంటాయి. భారత్ పై భారీగా ఆశలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకపోయినా సరే పాక్ ను ఈ మ్యాచ్ లో ఓడిస్తే చాలు ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లినట్లే భావిస్తారు. రెండు దేశాల భారత్ అభిమానుల పరిస్థితి అదే. జెండాలతో మైదానంలో ఒకటే అరుపులు. కామెంట్రీ కూడా వినపడనంతగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోతుంది.
రెండు జట్ల పరిస్థితి....
అయితే రెండుజట్ల పరిస్థితి ప్రస్తుతం బలంగానే ఉండటంతో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. విదేశీగడ్డపై రెండు జట్లకు ప్రత్యర్థిని ఓడించిన చరిత్ర ఉంది. అలాగే టీంఇండియా ఆటగాళ్లతో పాటు పాక్ ఆటగాళ్లు కూడా కుదురుకుంటే ఇక ఆపేవారుండరు. ఆటగాళ్లలో కూడా ఇతర దేశాల మీద ఆడే తీరుకు ఈ రెండు జట్లు పోటీ పడే తీరుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కసితో రెండు జట్ల ప్లేయర్లు రగిలిపోతుంటారు. ఆటగాడు అవుటయినంత మాత్రాన వెంటనే సెలబ్రేషన్ లో మునిగిపోతారు.మాటలను కూడా తూలుతారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు జరిగే మ్యాచ్ మాత్రం అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎంతగా అంటే ఈరోజు నుంచే క్రికెట్ ఫీవర్ ప్రారంభమయింది.
Next Story