Thu Nov 28 2024 00:43:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే?
ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2023 కి ముహూర్తం కుదిరింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2023 కి ముహూర్తం కుదిరింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ APL 2023 లీగ్ దశ ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 27న ఫైనల్‌తో ముగుస్తుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం 11 రోజుల T20 టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. గత సంవత్సరం ఆరు జట్లు తలపడగా.. ఈ ఏడాది కూడా ఆ జట్లే ఉన్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్స్ కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్ జట్లు ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. లీగ్ దశలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు APL 2023 ప్లేఆఫ్‌లకు చేరుకుంటాయి. ఆరు జట్లు ఒకే రౌండ్-రాబిన్ ఫార్మాట్లో ప్రతి జట్టుతో ఒకసారి ఆడతాయి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ఫ్యాన్‌కోడ్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కు చెందిన స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ (ఇంగ్లీష్) మరియు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు SD & HD ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
August 16 Wednesday Coastal Riders vs Bezawada Tigers 5 PM
August 17 Thursday Vizag Warriors vs Godavari Titans 10 AM
August 17 Thursday Rayalaseema Kings vs Uttarandhra Lions 3 PM
August 18 Friday Coastal Riders vs Vizag Warriors 12 PM
August 18 Friday Bezawada Tigers vs Godavari Titans 5 PM
August 19 Saturday Bezawada Tigers vs Rayalaseema Kings 10 AM
August 19 Saturday Uttarandhra Lions vs Coastal Riders 3 PM
August 20 Sunday Uttarandhra Lions vs Vizag Warriors 10 AM
August 20 Sunday Godavari Titans vs Rayalaseema Kings 3 PM
August 21 Monday Bezawada Tigers vs Uttarandhra Lions 12 PM
August 21 Monday Rayalaseema Kings vs Vizag Warriors 5 PM
August 22 Tuesday Godavari Titans vs Coastal Riders 12 PM
August 22 Tuesday Vizag Warriors vs Bezawada Tigers 5 PM
August 23 Wednesday Coastal Riders vs Rayalaseema Kings 12 PM
August 23 Wednesday Uttarandhra Lions vs Godavari Titans 5 PM
August 25 Friday Eliminator: 3rd vs 4th 12 PM
August 25 Friday Qualifier 1: 1st vs 2nd 5 PM
August 26 Saturday Qualifier 2: Eliminator Winner vs Qualifier 1 Loser 5 PM
August 27 Sunday Final: Qualifier 1 Winner vs Qualifier 2 Winner 5 PM
Next Story