Mon Apr 07 2025 04:35:40 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు మరో బిగ్ మ్యాచ్
నేడు మరో బిగ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో నేడు ముంబయి ఇండియన్స్ తలపడనుంది.

నేడు మరో బిగ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో నేడు ముంబయి ఇండియన్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెప్పాలి. చివరి వరకూ టెన్షన్ పెడుతుందని చెప్పక తప్పదు. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. రెండు జట్లు ఓటమితో కసి మీద ఉన్నాయి. దీంతో గెలుపు కోసం ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ప్రయత్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
బలాబలాలు...
బలాబలాలు తీసుకున్నా రెండు జట్లు సమ ఉజ్జీలుగానే ఉండటంతో ఈ మ్యాచ్ మరోసారి చివరి బాల్ వరకూ టెన్షన్ పెడుతుందన్న అంచనాలు క్రికెట్ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా తిరిగి వచ్చి తన జట్టుకు విజయం అందిస్తాడా? లేక శుభమన్ గిల్ ఈ మ్యాచ్ ను గెలుచుకుని తమ సత్తా ఇది అని చాటుతాడా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ శనివారం కావడంతో లక్షలాది మంది ఫ్యాస్స్ ఎదురు చూస్తున్నారు.
Next Story