Mon Apr 07 2025 04:35:39 GMT+0000 (Coordinated Universal Time)
వరల్డ్ కప్ లో మరోసంచలనం
టీ 20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయింది. జింబాబ్వే పై నెదర్లాండ్స్ గెలిచింది

టీ 20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయింది. జింబాబ్వే పై నెదర్లాండ్స్ గెలిచింది. ఐదు వికెట్ల తేడాతో జింబాబ్వే పై నెదర్లాండ్స్ గెలిచింది. టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆల్ అవుల్ అయింది. జింబాబ్వేలో సికిందర్ రాజా 40 పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచారు. మిగిలిన వారంతా పెవిలియన్ దారి పట్టారు.
జింబాబ్వేపై నెదర్లాండ్స్ గెలుపు....
118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ తొలి నుంచి కుదరుగానే ఆడింది. కేవలం 18 ఓవర్లలోనే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మ్యాక్స్ ఓడౌడ్ 52 పరుగులు చేశాడు. టాప్ కూపర్ 32 పరుగులు చేశాడు. వికెట్లు పడినా స్కోరు తక్కువ కావడంతో జింబాబ్వేకు పరాజయం తప్పలేదు. పాకిస్థాన్ ను ఓడించిన జింబాబ్వే నెదర్లాండ్ చేతిలో ఓటమి పాలయింది.
Next Story