Sun Mar 30 2025 12:40:21 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు మరో అదిరిపోయే మ్యాచ్
విశాఖలో నేడు ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్కు సర్వం సిద్ధమయింది. ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఆడనుంది

విశాఖలో నేడు ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్కు సర్వం సిద్ధమయింది. ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఆడనుంది. రాత్రి 7:30 గంటలకు విశాఖ లోని వైఎస్ స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అభిమానులను అలరించే అవకాశముంది. ఎందుకంటే రెండు జట్లు బలబలాలను చూసుకుంటే పటిష్టంగా ఉన్నాయి.
హాట్ కేకుల్లా...
విశాఖలో జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్మడంతో క్షణాల్లో విక్రయం జరిగిపోయాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్ను వీక్షించేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు. దీంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
Next Story