Mon Dec 23 2024 06:26:23 GMT+0000 (Coordinated Universal Time)
ట్రెండింగ్ లో #ArrestKohli.. రోహిత్ అభిమానిని చంపేసిన విరాట్ కోహ్లీ అభిమాని
తమిళనాడులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య జరిగిన గొడవలో ఒక ప్రాణం పోయింది. అరియలూర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడితో పాటు చనిపోయిన వ్యక్తి ఇద్దరూ మంచి స్నేహితులని, మద్యం సేవిస్తూ.. భారత క్రికెట్ జట్టు గురించి చర్చించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులు తిట్టుకున్నారు. నిందితుడైన విరాట్ కోహ్లీ అభిమాని మద్యం మత్తులో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
అరియలూరు జిల్లా పొయ్యూరు అనే గ్రామంలో పి.విఘ్నేష్ (24), చనిపోయాడు. మంగళవారం రాత్రి మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఇస్టేట్ ప్రాంతంలో విఘ్నేష్, ధర్మరాజ్ మద్యం తాగుతూ క్రికెట్ గురించి చర్చ ప్రారంభించారు. ఇంతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంను విరాట్ కోహ్లీని హేళన చేస్తూ విఘ్నేష్ మాట్లాడాడు. దీంతో మందు బాటిల్తో విఘ్నేష్ తల పగలకొట్టాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బుధవారం ఉదయం విఘ్నేష్ మృతదేహాన్ని అక్కడి కార్మికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ట్విట్టర్లో శనివారం ఉదయం '#ArrestKohli' అనే హ్యాష్ట్యాగ్ ఉదయం నుండి ట్రెండింగ్లో ఉంది.
Next Story