Sun Dec 22 2024 09:28:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆసియా కప్ శ్రీలంక నుండి షిఫ్ట్.. ఎక్కడికంటే..?
ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు
శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆసియా కప్ టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు శ్రీలంక క్రికెట్ సొంతం చేసుకోగా.. తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా టోర్నీని నిర్వహించలేమని లంక బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టోర్నీ యూఏఈలో జరుగుతుందని, ఈ సమయంలో అక్కడ అయితేనే వర్షాలు పడవని గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్ సమావేశానికి హాజరైన గంగూలీ చెప్పారు. ఇక ఈసారి ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) నిర్ణయించింది. దేశంలో కొనసాగుతున్న రాజకీయ అశాంతి కారణంగా లంక ప్రీమియర్ లీగ్ (LPL) మూడవ సీజన్‌ను కూడా శ్రీలంక క్రికెట్ (SLC) వాయిదా వేసింది.
T20 ఆసియా కప్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆగస్ట్ 24-సెప్టెంబర్ 10 వరకు నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచ కప్‌కు వార్మప్‌గా భావిస్తున్న ఆసియా కప్ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతుంది. ఆసియా కప్ క్వాలిఫైయింగ్ రౌండ్ ఆగస్టు 24న ప్రారంభమవుతుంది. ఆసియా కప్ సెప్టెంబర్ 10 లేదా 11 వరకు కొనసాగుతుంది. ఆతిథ్య దేశం ఇప్పటికీ శ్రీలంక బోర్డుగా ఉంటుంది. లంక బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బోర్డు ఈవెంట్ విధివిధానాలను ఖరారు చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆసియా కప్ 2022 ఇప్పటికే రెండుసార్లు ఆలస్యమైంది. కోవిడ్-19 కారణంగా 2020లో ఒకసారి.. ఆపై 2021లో మరోసారి వాయిదా పడింది.
News Summary - Asia Cup 2022 Schedule To Be Out Soon
Next Story