Fri Nov 22 2024 17:50:41 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి 'ఇండియా-పాకిస్థాన్' మ్యాచ్
సెప్టెంబరు 4న తమ చివరి గ్రూప్ గేమ్‌లో నేపాల్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్‌లో సూపర్ ఫోర్ దశకు
సెప్టెంబరు 4న తమ చివరి గ్రూప్ గేమ్‌లో నేపాల్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్‌లో సూపర్ ఫోర్ దశకు భారత్ అర్హత సాధించింది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో పాక్ తో తలపడిన భారత్.. సెప్టెంబర్ 10, 2023న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబరు 03, 2023న జరిగిన రెండు జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది కానీ.. పల్లెకెలెలో వర్షం కారణంగా రద్దయింది, ఆసియాకప్‌లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్‌ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఇక్కడి నుండి మ్యాచ్ మార్చే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.
నేపాల్ పై ఈ విజయంతో భారత్ సూపర్-4 దశలోకి ప్రవేశించింది. గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్ కూడా సూపర్-4లో అడుగుపెట్టింది. గ్రూప్-ఏలో భారత్, పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. పాక్, భారత్ జట్లు నేపాల్ పై విజయం సాధించాయి. భారత్, పాక్ ఖాతాలో చెరో 3 పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో గ్రూప్ లో పాక్ అగ్రస్థానం దక్కించుకుంది. గ్రూప్ దశలో భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం అయింది. సూపర్-4 దశలో దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచిన పాక్, రెండో స్థానంలో నిలిచిన భారత్ సెప్టెంబరు 10న కొలంబోలో తలపడనున్నాయి. ఆసియా కప్ 2023 చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో సెప్టెంబర్ 05న ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకతో తలపడనుంది.
Next Story