Sun Dec 22 2024 17:45:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏమి జరుగుతోంది.. భారత్ కు వచ్చేసిన బుమ్రా
ఆసియా కప్ లో భాగంగా నేడు భారత్ నేపాల్ తో తలపడనుంది. ఈ సమయంలో భారత జట్టులో కీలక బౌలర్ అయిన బుమ్రా టీమిండియాను వీడాడు. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వచ్చాడు బుమ్రా. అయితే మరి కొద్ది రోజుల్లో ఆసియా కప్ లో మళ్లీ భాగమవుతాడని అంటున్నారు. సెప్టెంబరు 4, సోమవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్ లో బుమ్రా ఆడడం లేదు. అయితే కీలకమైన సూపర్ 4 పోరుకు జట్టులోకి తిరిగి రానున్నాడు. జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో బుమ్రా స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు బుమ్రా. వెన్ను గాయం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అతడి పేస్ బౌలింగ్ మీద భారతజట్టు ఎంతగానో ఆధారపడింది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అద్భుతమైన బౌలింగ్ తో అతడు జట్టును పలు మార్లు గట్టెకించాడు. అతని ప్రత్యేకమైన బౌలింగ్ శైలి కారణంగా జట్టుకు కీలకమైన ఆటగాడిగా మారాడు. ప్రపంచ కప్‌కు అతన్ని సిద్ధం చేయడంపై దృష్టి సారించింది జట్టు యాజమాన్యం. ఆసియా కప్ లో కూడా సత్తా చాటాలని బుమ్రా అనుకుంటూ ఉన్నాడు. మొదటి మ్యాచ్ లో వర్షం కారణంగా బౌలింగ్ వేయలేకపోయాడు బుమ్రా. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతనికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు కానీ తన బ్యాటింగ్‌తో రాణించాడు. కేవలం 14 బంతుల్లోనే 16 పరుగులు చేశాడు.
Next Story