Sat Nov 23 2024 02:33:59 GMT+0000 (Coordinated Universal Time)
ఓపెనర్లే ఫినిష్ చేశారు
ఆసియా కప్ భారత్ దే. సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఆసియా కప్ ను టీం ఇండియా ముద్దాడింది.
ఆసియా కప్ భారత్ దే. సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఆసియా కప్ ను టీం ఇండియా ముద్దాడింది. ఇందుకు భారత్ బౌలర్లను మెచ్చుకోకుండా ఉండలేం. కేవలం యాభై పరుగులకే శ్రీలంకను కట్టడి చేయగలిగారంటే అది ఖచ్చితంగా బౌలర్ల ఘనత. అందులోనూ హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ అరుదైన రికార్డుతో ఆరు వికెట్టు తీసి శ్రీలంక నడ్డి విరిచాడు. దీంతో అత్యల్ప స్కోరుకే శ్రీలంక ఆసియా కప్ లో అవుట్ అయింది. తక్కువ స్కోరు ఉండటంతో బ్యాటర్లకు పెద్దగా కష్టం అనిపించలేదు. తొలి పవర్ ప్లేలోనే ఆసియా కప్ ను భారత్ కొట్టేసింది. అంటే పది ఓవర్లు కూడా ముగియకుండానే ఆటను ఫినిష్ చేసేశారు. ఆరు ఓవర్లకే ఆసియా కప్ ను టీం ఇండియా సాధించింది.
ఓపెనర్లు...
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ దిగాల్సి ఉండగా ఇషాన్ కిషన్, గిల్ ఆడారు. దీనిని బట్టే భారత్ ఎంత సులువుగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు ఓపెనర్లు శ్రీలంక బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. ఫోర్లతో మైదానంలో లంక ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ తమకు అప్పగించిన మిషన్ ను పూర్తి చేశారు. కేవలం పది ఓవర్లలోపే శ్రీలంక చేసిన యాభై ఒక్క పరుగులు చేసి భారత్ కు ఆసియా కప్ ను తెచ్చి పెట్టారు. ఇండియా శ్రీలంకపై సునాయాస విజయం సాధించింది. ఇషాన్ కిషన్ 23, శుభమన్ గిల్ 27 పరుగులు చేసి శ్రీలంక ఉంచిన అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. సహజంగానే మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ గా సిరాజ్ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. శభాష్ ఇండియా.
Next Story